సోనాలి ట్రీట్మెంట్ మొద‌లైంది..

Last Updated on by

సోనాలి బింద్రేకు కాన్స‌ర్ అనే సంగ‌తి నిమిషాల్లో ఇండియా అంతా పాకిపోయింది. ఈ రోజుల్లో సోష‌ల్ మీడియా ఎంత వేగంగా ఉందో చెప్ప‌డానికి సోనాలి న్యూస్ స్ప్రెడ్ అయిన విధాన‌మే నిద‌ర్శ‌నం. ఇదిలా ఉంటే ఇప్పుడు ఈమెకు క్యాన్స‌ర్ ఉంద‌నే విష‌యం తెలిసింది.. అది కూడా నాలుగో స్టేజ్ లో ఉంది. ఇప్ప‌టికే క్యాన్స‌ర్ తో కొంద‌రు సినిమా వాళ్లు గ‌ట్టిగానే పోరాడి బ‌య‌ట‌పడ్డారు. ఇప్పుడు సోనాలి బింద్రె కూడా ఇదే చేస్తుంది. త‌న క్యాన్స‌ర్ పై యుద్ధం ప్ర‌క‌టించింది ఈ ముద్దుగుమ్మ‌. తాజాగా ట్రీట్మెంట్ కోసం లండ‌న్ వెళ్లింది ఈ భామ‌. తాజాగా దీనికోసం జుట్టు కూడా తీసేసారు. క్యాన్స‌ర్ పై నా యుద్ధం మొద‌లైంది.. త్వ‌ర‌లోనే బ‌య‌టికి వ‌స్తానంటుంది ఈ ముద్దుగుమ్మ‌.

ఈమె పాజిటివ్ వైబ్రేష‌న్స్ చూసి ఫ్యాన్స్ కూడా ఖుషీ అవుతున్నారు. ఈమెకు సోకిన కాన్స‌ర్ పేరు మెటెస్టిక్ కాన్స‌ర్. బాడీలో ఓ చిన్న ప్లేస్ లో మొద‌లై.. ఆ త‌ర్వాత ర‌క్తంలోకి ఆ కాన్స‌ర్ క‌ణాలు సోకుతాయి. అలా బాడీ అంతా వ్యాపించి ప్రాణాలు తీసేస్తుంది. అయితే ఇప్పుడు సోనాలి బింద్రేకు క్యాన్స‌ర్ ఫైన‌ల్ స్టేజ్ లో ఉంది. అయినా కూడా స‌రైన టైమ్ లోనే ఇది బ‌య‌ట ప‌డ‌టం ఆమె అదృష్టం. దాంతో వెంట‌నే న్యూ యార్క్ వెళ్లి ట్రీట్మెంట్ మొద‌లు పెట్టింది. సోనాలి కంటే ముందే మ‌నీషా కోయిరాలా.. గౌత‌మి లాంటి వాళ్ళు కూడా కాన్స‌ర్ బారిన ప‌డి ధైర్యంగా పోరాడి బ‌య‌టికి వ‌చ్చారు. ఇప్పుడు సోనాలి కూడా ఇదే చేస్తుంద‌ని న‌మ్ముతున్నారు అభిమానులు.

User Comments