మెగా నాయిక‌కు క్యాన్స‌ర్‌

Last Updated on by

మెగాస్టార్ స‌ర‌స‌న `ఇంద్ర` చిత్రంలో న‌టించింది సోనాలి బింద్రే. ఈ అమ్మ‌డు టాలీవుడ్‌లో టాప్ హీరోల స‌ర‌స‌న న‌టించింది. ఇప్ప‌టికీ తెలుగు యువ‌త గుండెల్లో రాధే గోవింద.. పాట గుర్తుకొస్తే సోనాలి గుర్తుకు రావాల్సిందే. అలాగే ఖునాల్ స‌ర‌స‌న `ప్రేమికుల రోజు` అనే చిత్రంలో న‌టించింది. నూనూగు మీసాల కుర్రాళ్ల గుండెల్లో క‌ల‌ల‌రాణిగా మిగిలిపోయింది. అందుకే సోనాలి ప్ర‌తి యాక్టివిటీని మ‌న తెలుగు వాళ్లు ప‌రిశీలిస్తుంటారు.

తాజాగా ఈ భామ‌కు సంబంధించిన ఓ షాకింగ్ న్యూస్ అభిమానుల్ని క‌ల‌వ‌ర‌పెడుతోంది. 43 ఏళ్ల సోనాలికి ఊహించ‌ని విప‌త్తు వ‌చ్చింది. సోనాలికి క్యాన్స‌ర్ ఉంద‌ని ఇటీవ‌లే ఓ మెడిక‌ల్ రిపోర్ట్ వెల్ల‌డించింది. దీంతో ఆ కుటుంబంలో ఒక్క‌సారిగా అల‌జ‌డి చెల‌రేగింది. ఇది కేవ‌లం సోనాలికే కాదు, ప్ర‌పంచ‌వ్యాప్తంగా ఉన్న మెగాభిమానుల్లోనూ క‌ల‌త‌కు కార‌ణ‌మైంది. మ‌నీషా కొయిరాలా, అయేషా ట‌కియా వంటి క‌థానాయిక‌లు క్యాన్స‌ర్ మ‌హ‌మ్మారి బారిన ప‌డిన సంగ‌తి తెలిసిందే.

User Comments