సోనాలికి సోకింది ఏ క్యాన్స‌ర్.. ప‌రిస్థితేంటి..?

సోనాలి బింద్రేకు క్యాన్స‌ర్ అనే సంగ‌తి నిమిషాల్లో ఇండియా అంతా పాకిపోయింది. ఈ రోజుల్లో సోష‌ల్ మీడియా ఎంత వేగంగా ఉందో చెప్ప‌డానికి సోనాలి న్యూస్ స్ప్రెడ్ అయిన విధాన‌మే నిద‌ర్శ‌నం. ఇదిలా ఉంటే ఇప్పుడు ఈమెకు క్యాన్స‌ర్ ఉంద‌నే విష‌యం తెలిసింది.. అయితే అది ఏ క్యాన్స‌ర్.. ఎలా ఉంది.. ఇప్పుడు ఏ స్టేజ్ లో ఉంది అనేది మాత్రం అభిమానుల‌ను కంగారు పెడుతున్న విష‌యం. ఈ విష‌యంపై ఇప్పుడు సోనాలి బింద్రే కూడా స్పందించింది. ఈమెకు సోకిన క్యాన్స‌ర్ పేరు మెటెస్టిక్ క్యాన్స‌ర్. బాడీలో ఓ చిన్న ప్లేస్ లో మొద‌లై.. ఆ త‌ర్వాత ర‌క్తంలోకి ఆ క్యాన్స‌ర్ క‌ణాలు సోకుతాయి. అలా బాడీ అంతా వ్యాపించి ప్రాణాలు తీసేస్తుంది.

అయితే ఇప్పుడు సోనాలి బింద్రేకు క్యాన్స‌ర్ ఫైన‌ల్ స్టేజ్ లో ఉంది. అయినా కూడా స‌రైన టైమ్ లోనే ఇది బ‌య‌ట ప‌డ‌టం ఆమె అదృష్టం. దాంతో వెంట‌నే న్యూయార్క్ వెళ్లి ట్రీట్మెంట్ మొద‌లు పెట్టింది. సోనాలి కంటే ముందే మ‌నీషా కోయిరాలా.. గౌత‌మి లాంటి వాళ్ళు కూడా క్యాన్స‌ర్ బారిన ప‌డి ధైర్యంగా పోరాడి బ‌య‌టికి వ‌చ్చారు. ఇప్పుడు సోనాలి కూడా ఇదే చేస్తుంద‌ని న‌మ్ముతున్నారు అభిమానులు. ఈ కాన్స‌ర్ కార‌ణంగానే బాలీవుడ్ లో ఈమె హోస్ట్ చేస్తోన్న ఓ రియాలిటీ షో నుంచి త‌ప్పుకుంది. ప్ర‌స్తుతం ఈ కార్య‌క్ర‌మానికి హోస్ట్ గా హ్యూమాఖురేషి వ‌చ్చింది. అప్పుడు స‌డ‌న్ గా సోనాలి త‌ప్పుకోవ‌డంతో ఎవ‌రికీ అర్థం కాలేదు ఏం జ‌రుగుతుంద‌ని.. ఇప్పుడు ఆ క్లారిటీ వ‌చ్చింది.