స్టార్ డాట‌ర్ పాత ఎఫైర్ లీక్‌

Last Updated on by

స్టార్ డాట‌ర్ సోన‌మ్ క‌పూర్ ఎఫైర్ ఒక‌టి లీకైంది. ఇంత‌కీ ఈ అమ్మ‌డి ఎఫైర్ ఎవరితో? తాను వ‌ల‌చిన ఆనంద్ అహూజాతోనేనా? లేక ఇంకెవ‌రితోనైనానా? ప‌్ర‌స్తుతం బాలీవుడ్‌లో ఆస‌క్తిక‌ర చ‌ర్చ ఇది. అయితే మ‌రీ అంత కంగారుప‌డేదేం లేదు. సోన‌మ్ వాస్త‌విక జీవితంలో అస‌లు సిస‌లు బోయ్‌ఫ్రెండ్ దిల్లీ బిజినెస్‌మేన్ ఆనంద్ అహూజా మాత్ర‌మే. క‌థానాయ‌కుల‌తో అస్స‌లు ఎఫైర్లు ఏమీ లేవు!?

అయితే ఈ భామ ప్ర‌స్తుతం న‌టిస్తున్న హీరోగారి బ‌యోపిక్‌లో మాత్రం ఎఫైర్ సాగించింది. అత‌గాడు ది గ్రేట్ ఖ‌ల్‌నాయ‌క్ సంజ‌య్‌ద‌త్‌. మున్నాభాయ్ దందాల్లో క‌థానాయిక‌ల‌తో ఎఫైర్ దందాలు ఉన్నాయి. అందునా అప్పుడు సంజ‌య్‌ద‌త్‌ అస‌లే యుక్త‌వ‌య‌స్కుడు. ఆ క్ర‌మంలోనే కెరీర్ ఆరంభ‌మే అత‌డు మాధురి ధీక్షిత్‌తో ఎఫైర్ సాగించాడ‌న్న టాక్ న‌డిచింది. అలానే నాటి క‌థానాయిక టీనా మునుమ్‌తోనూ సంజూభాయ్ ప్రేమాయ‌ణంపై ఘాటైన ప్ర‌చారం సాగింది. ద‌త్ బ‌యోపిక్ `సంజు`లో అత‌డి గాళ్‌ఫ్రెండ్ పాత్ర‌లో సోన‌మ్ న‌టించింది. రాజ్‌కుమార్ హిరాణీ ఈ చిత్రాన్ని తెర‌కెక్కిస్తున్న సంగ‌తి తెలిసిందే. అయితే ఈ సినిమాలో సోన‌మ్ పాత్ర ఏంటి? టీనానా? లేక మాధురినా? అన్న‌ది మాత్రం తేల‌లేదింకా. స్టార్ డాట‌ర్ ఇంత‌కీ ఇరు గాళ్‌ఫ్రెండ్స్‌లో ఎవ‌రి పాత్ర‌లో న‌టించింది?

User Comments