పెళ్ల‌య్యాక సోన‌మ్ కు A స‌ర్టిఫికేట్

ఇలా పెళ్లైందో లేదో అప్పుడే మ‌ళ్లీ సినిమాల‌తో బిజీ అయిపోయింది సోన‌మ్ క‌పూర్. ఈ భామ న‌టించిన వీరి ది వెడ్డింగ్ సినిమా జూన్ 1న విడుద‌ల కానుంది. తాజాగా ఈ చిత్ర సెన్సార్ కార్య‌క్ర‌మాలు పూర్త‌య్యాయి. దీనికి సెన్సార్ బోర్డ్  ‘A’ స‌ర్టిఫికేట్ ఇచ్చారు. సోన‌మ్ క‌పూర్ చెల్లి రియాక‌పూర్.. జితేంద్ర కూతురు ఏక్తాక‌పూర్.. నిఖిల్ ద్వివేది.. శోభాక‌పూర్ క‌లిసి ఈ చిత్రాన్ని నిర్మించారు. ముందు ఈ చిత్రానికి ‘A’ కాకుండా మ‌రో స‌ర్టిఫికేట్ ఇచ్చి కొన్ని సీన్లు తీసేయాల‌ని సూచించారు అయితే ఏ సీన్స్ క‌ట్ చేయ‌కుండా ‘A’ స‌ర్టిఫికేట్ ఇవ్వాల‌ని కోరారు అనిల్ క‌పూర్, జితేంద్ర‌. అస‌లు ఏక్త‌క‌పూర్ సినిమా అంటేనే అది ‘A’ స‌ర్టిఫికేట్ సినిమా అని అంద‌రికీ అర్థ‌మైపోతుంది.

Sonam Kapoor Veere Di Wedding Coming With A Certificate

సెక్స్ అండ్ ఎంట‌ర్ టైన్మెంట్ ఇండియాలో ఎక్కువ‌గా అమ్ముడు అవుతాయని న‌మ్ముతుంది ఏక్తా. ఇప్పుడు వీరి ది వెడ్డింగ్ సినిమాను విడుద‌ల చేస్తుంది ఈమె. అందుకే ‘A’ స‌ర్టిఫికేట్ వ‌చ్చినా పెద్ద‌గా ఆశ్చ‌ర్య‌ప‌డ‌టం లేదు ఎవ‌రూ..! దానికితోడు సినిమాను కూడా చాలా బోల్డ్ గా తెర‌కెక్కించాడు ద‌ర్శ‌కుడు శ‌శాంక్ ఘోష్. క‌రీనా క‌పూర్, సోన‌మ్ క‌పూర్, స్వ‌ర‌భాస్క‌ర్, శిఖా త‌ల్సానియా ఇందులో కీల‌క పాత్ర‌ల్లో న‌టించారు. పెళ్లంటే ఇష్టం లేని న‌లుగురు అమ్మాయిల క‌థ ఇది. మ‌రి.. సోన‌మ్ పెళ్లైన వారం రోజుల‌కే ‘A’ స‌ర్టిఫికేట్ సినిమాతో వ‌చ్చేస్తుంది సోన‌మ్ క‌పూర్. ఏం చేస్తుందో మ‌రి..!

User Comments