పిక్ టాక్: సోకి`లేడీ`స్‌ ఎవ‌ర‌మ్మా?

Last Updated on by

ఈ ఫోటోలో ఉన్న సోకిలేడీస్ ఎవ‌రో గుర్తు ప‌ట్ట‌గ‌ల‌రా? .. అందాల‌ సోన‌మ్ క‌పూర్‌, క‌రీనా క‌పూర్‌ల‌ను వెంట‌నే గుర్తు ప‌ట్టేయొచ్చు కానీ.. ఆ ఇద్ద‌రితో పాటు ఉన్న వారిలో స్వ‌ర భాస్క‌ర్ కూడా అంతే ఫేమ‌స్సు. వీళ్లంతా `వీరే ది వెడ్డింగ్‌` చిత్రంలో న‌టిస్తున్నారు. ఇంత‌కీ ఈ డ్రెస్‌లో ఇలా ఎక్క‌డికి వెళ్లిన‌ట్టు అంటారా? ఇంకెక్క‌డికి ముంబైలో ఫేజ్ 3 వ‌ర‌ల్డ్ ఏదో మూల ఏదో ఒక పార్టీ ఎప్పుడూ జ‌రుగుతూనే ఉంటుంది. లేదా క్ల‌బ్బు, ప‌బ్బు ఎలానూ ఉండ‌నే ఉన్నాయి. అవీ కాక‌పోతే ఫ్యాష‌న్ షోలు, థియేట‌ర్లు వ‌గైరా వ‌గైరా అబ్బో అబ్బో చాలానే ఉన్నాయండీ.

కానీ వీళ్లు వెళ్లింది ఓ బ‌ర్త్ డే పార్టీకి. అది కూడా ది గ్రేట్ సాగ‌ర‌క‌న్య శిల్పా శెట్టి- రాజ్‌కుంద్రాల గారాల పుత్రుడు వియాన్ కుంద్రా పుట్టిన‌రోజు వేడుక‌ల‌కు ఎటెండ్ అయ్యారు. ఈ గ్రూప్ ఫోటో ప‌రిశీలిస్తే ఆ డ్రెస్సింగ్‌లో ప్ర‌త్యేకించి కాన్సెప్ట్ ఒక‌టి క‌నిపిస్తోంది. పాత షిఫాన్ చీర‌.. పైన బుట్ట బ్లౌజు కాలాన్ని గుర్తు చేస్తూ ఆ డిజైన్లు బావున్నాయి క‌దూ? ఈ ఫోటోల‌న్నిటినీ వైర‌ల్ భ‌యానీ ఇన్‌స్టాగ్ర‌మ్‌లో పోస్ట్ చేయ‌డంతో అస‌లు మ్యాట‌ర్ లీకైంది. గుంపులో శిఖ త‌ల‌సానియా అనే ఫేజ్ 3 గాళ్ కూడా ఉంది. ముద్దుగుమ్మ‌ల చివ‌రిలో బొద్దుగుమ్మ బోన‌స్ అన్న చందంగా!

User Comments