సోన‌మ్ పెళ్లి వెన్యూ ఇదే

Last Updated on by

క‌పూర్ ఇంట పెళ్లి భాజా మోగ‌నున్న సంగ‌తి తెలిసిందే. బోనీక‌పూర్‌-అనీల్ క‌పూర్ బ్ర‌ద‌ర్స్ సోన‌మ్ పెళ్లిని డీసెంట్ ఎఫైర్‌గా ఉండాల‌ని అందుకు త‌గ్గ ఏర్పాట్లు చేస్తున్నారు. వాస్తవానికి ఈ పెళ్లి విదేశాల్లో డెస్టినీ మ్యారేజ్ త‌ర‌హా ఉండాల‌ని సోన‌మ్ – అహూజా భావించినా.. శ్రీ‌దేవి మ‌ర‌ణానంతరం స‌న్నివేశం మారిపోయింది. ఇటీవ‌లే మే 8న‌ ముంబైలో ఈ పెళ్లి వేడుక జ‌ర‌గ‌నుంద‌ని రివీలైంది.
తాజాగా వెన్యూ డీటెయిల్స్ తెలిశాయి. సోన‌మ్ ఇంట మెహందీ ఫంక్ష‌న్ మే 7న స‌న్‌టెక్‌- సిగ్నేచ‌ర్ ఐల్యాండ్ బికేసీలో జ‌ర‌గ‌నుంది. ఉద‌యం 11 గంట‌ల నుంచి 12.30 మ‌ధ్య‌ బీకేసీలో ఒక‌టే సంద‌డి నెల‌కొంటుంద‌ని తెలుస్తోంది. అనంత‌ర పెళ్లి వేడుక ను మే8న‌ సోన‌మ్ ఆంటీ క‌వితా సింగ్‌కు చెందిన బాంద్రా బంగ్లాలో జ‌ర‌గ‌నుంది. ఈ బంగ్లా పేరు రాక్ డేల్‌. పెళ్లి అనంత‌రం తాజ్ లీలా హోట‌ల్‌లో అదేరోజు సాయంత్రం విందు కార్య‌క్ర‌మం జ‌ర‌గ‌నుంది.

User Comments