పంచ వ‌న్నెల రామ‌చిల‌క‌!

Last Updated on by

ఎదలోని ప్రేమను మృదువైన మాటను రామచిలక గోరువంక బొమ్మ గీసి తెలుపనా…
రాధాకృష్ణుల వంక చేయిచూపి తెలుపనా చిరునవ్వుతో తెలుపనా…
కొనచూపుతో తెలుపనా నీళ్ళు నమిలి తెలుపనా.. గోళ్ళు కొరికి తెలుపనా తెలుపకనే తెలుపనా…
ఎలా ఎలా ఎలా ఎలా …..తెలుప‌ను…

పంచ వన్నెల చిలక రెక్కపై పచ్చతోరణం ప్రేమ తామరాకుపై నీటి బొట్టులా తళుకు మంటదీ ప్రేమ సీతాకోక చిలుక సోయగాల చినుకా సీతాకోక చిలుక సోయగాల చినుకా ముద్దు ముద్దు గున్నవే నువ్వు ఓసి కన్నె గోపికా తుళ్ళి తుళ్ళి పడక కొంగుముడి వేసుకో …ఆహా! ఆ దివ్య‌రూపం చూడ‌గానే ఏ క‌విలో అయినా జ్వ‌లించే క‌విత్వం ఇది. ఆ పెళ్లి ఇంట నాద‌స్వ‌రం ఆకాశాన్ని తాకక ముందే ఇంటి గడప ముందు, పంచ వన్నెల రామచిలక వాలింది. పదహారు కళల పూర్ణమ్మ ముసిముసిగా న‌వ్వుకుని.. ఆ అందంపై దుప్పటి కప్పేసి, అక్కున చేర్చుకొంది. రామ చిలక రెక్కల పల్లకీ వేసింది. పండిన దొండపండు రంగు బుడగ తీపి పాటలు మోసుకువెళ్లింది. గొంతు సవరించుకొంటూ, తన పాటలను తనే వెతుక్కొంటూ ప‌రిగెత్తింది. అహూజాతో పెళ్లి వేళ సోన‌మ్ ఇలా త‌ళుక్కుమంది. ముంబై బాంద్రాలోని సోన‌మ్ ఆంటీ గారి భారీ భ‌వంతి-రాక్‌డేల్‌లో నేటి ఉద‌యం 11.30 ప్రాంతంలో ఈ వివాహం అంగ‌రంగ వైభ‌వంగా జ‌రిగింది. ఈ వేడుక‌లో సినీతార‌ల సంద‌డి చుక్క‌ల్ని తాకిందంటే న‌మ్మండి!

User Comments