సోన‌మ్‌కి ల‌గ్గమెట్టారు మామా!

Last Updated on by

సోన‌మ్‌కి ల‌గ్గ‌మెట్టారు మామా! మే 8 తాళి క‌ట్టు ముహూర్తం! తాను వ‌ల‌చిన ఆనంద్ అహూజా మూడుముళ్లు వేసే ముహూర్తం ఆరోజే ఫిక్స్ చేశారు. ప్ర‌స్తుతం క‌పూర్ ఫ్యామిలీ పెళ్లి ప‌నుల్లో బిజీ బిజీ. ముంబై లో వెన్యూని ఫిక్స్ చేశారని తెలుస్తోంది. అయితే ఈ పెళ్లి అంగ‌రంగ వైభ‌వంగా ఈ వివాహం జ‌రుగుతుంద‌నుకుంటే పొరపాటు! అంత ఆస్తిమంతులు.. స్థితిమంతులు అయినా ఆ ఇంట ఇప్ప‌ట్లో పెళ్లి వైభ‌వంగా జ‌ర‌గ‌దు. ఎందుకంటే .. స‌రిగ్గా నెల‌న్న‌ర క్రితం అతిలోక సుంద‌రి శ్రీ‌దేవి మ‌ర‌ణం ఆ ఇంటిల్లిపాదినీ కుంగ‌దీసింది.

శుభ‌మా అని పెళ్లికి వెళితే.. శుభమా అని సోన‌మ్‌ని పెళ్లి కూతురిని చేయాల‌ని అంతా అనుకుంటుంటే ఊహించ‌ని ఆ వార్త కపూర్ ఫ్యామిలీని కుదిపేసింది. అందుకే ఆచితూచి పెళ్లి ముహూర్తం ఖ‌రారు చేశారు. ఇన్నాళ్లు తేదీ ఖ‌రారు చేయ‌క‌పోవ‌డంతో ఎంతో క‌న్ఫ్యూజ‌న్‌కి గురైన అభిమానులు.. మే 8 ఫిక్స‌యింది.. అన‌గానే సోన‌మ్‌కి శుభాకాంక్ష‌లతో మోత మోగించారు. సామాజిక మాధ్య‌మాల్లో పుష్ప‌గుచ్ఛాల్ని అందించే ప్ర‌య‌త్నం చేశారు. ఇక ఫ్యాష‌నిస్టాను మునుప‌టిలో రెడ్ హాట్ బికినీల్లో చూడ‌డం కుదురుతుందో లేదోన‌ని వేరొక వైపు అభిమానుల్లో ఒక‌టే క‌ల‌త‌. ముంబైలో పెళ్లి చేసుకుంటోంది కాబ‌ట్టి, అటువైపు రాణీ హంస‌ల రాచ‌న‌గ‌రం ప్యారిస్ మూగ‌వోతుందేమో?

User Comments