జ‌క్క‌న్న‌పై మ‌న భామ‌లు గ‌రం!!

ఎస్.ఎస్.రాజ‌మౌళి ద‌ర్శ‌క‌త్వ ంలో ఆర్.ఆర్.ఆర్ క‌థానాయిక‌ల గురించి గ‌త కొంత‌క‌లంగా ఆస‌క్తిక‌ర చ‌ర్చ సాగుతోంది. ఈ చిత్రంలో క‌థానాయిక‌లుగా రాజ‌మౌళి ఎవ‌రిని ఎంపిక చేసుకుంటున్నారు? అన్న‌దానిపై ఇంత‌కాలం స‌రైన క్లారిటీ లేదు. రామ్ చ‌ర‌ణ్ స‌ర‌స‌న ఎవ‌రు? ఎన్టీఆర్ స‌ర‌స‌న ఎవ‌రు న‌టిస్తున్నారు? అన్న‌దానికి స‌రైన వివ‌రం లేదు. చ‌ర‌ణ్ స‌ర‌స‌న జాన్వీ న‌టిస్తోంద‌ని, ఎన్టీఆర్ స‌ర‌స‌న ఆలియా భ‌ట్ క‌థానాయిక‌గా ఎంపికైందని, ప‌రిణీతి చోప్రాని సంప్ర‌దిస్తున్నార‌ని, దీపిక‌కు ఓ ఆప్ష‌న్ ఇచ్చార‌ని ఇలా ర‌క‌ర‌కాల వార్త‌లు వ‌చ్చాయి. వీటితో పాటే కీర్తి సురేష్ కు రాజ‌మౌలి ఓ ఆఫ‌ర్ ఇచ్చార‌న్న ప్ర‌చారం ఉంది.

అయితే వీళ్ల‌లో ఫ‌లానా భామ‌ను ఫైన‌ల్ చేశాం అని రాజ‌మౌళి ఇన్నాళ్లు చెప్ప‌లేదు. అయితే ఆర్.ఆర్ఆర్ ఈవెంట్ లో దీనిపై ఎస్.ఎస్.రాజ‌మౌళి అండ్ టీమ్ స్వ‌యంగా క్లారిటీ ఇచ్చేశారు. ఈ చిత్రంలో క‌థానాయిక‌లుగా బాలీవుడ్ సుకుమారి ఆలియా భ‌ట్, అలాగే హాలీవుడ్ క‌థానాయిక డైజీ అడ్గార్జియోన్స్ క‌థానాయిక‌లుగా న‌టిస్తున్నార‌ని ప్ర‌క‌టించారు. ఓ విమానాశ్ర‌యంలో ఆలియాని క‌లిసి సీత పాత్ర‌ను వినిపించాన‌ని, ఆ పాత్ర‌లో న‌టించేందుకు తాను ఆస‌క్తిని క‌న‌బ‌రిచింద‌ని రాజ‌మౌళి క్లారిటీనిచ్చారు. ఇక డైజీ పాత్ర ఎలా ఉంటుంది? అంటే స‌రైన స‌మాచారం లేదు. త‌నో బ్రిలియంట్ ఆర్టిస్టు అని మాత్రం అనేశారు. తాను ఒక ఆంగ్లేయురాలి పాత్ర‌లో న‌టిస్తుంద‌ని మాత్రం అర్థ‌మ‌వుతోంది. అయితే ఆర్.ఆర్.ఆర్ లో ఓ సౌత్ బ్యూటీ న‌టించేందుకు ఆస్కారం లేదా? అంటే లేక‌పోలేదు. ఇంకా క‌థానాయిక‌ల పాత్ర‌ల్ని పూర్తిగా డిస్ క్లోజ్ చేసేశామ‌ని రాజ‌మౌళి పూర్తిగా చెప్ప‌లేదు. అయితే ఆలియా, డైజీ కీల‌క పాత్ర‌లు పోషిస్తున్నారు. ఇక కొమ‌రం భీమ్, అల్లూరి జీవితాల్లో మగువ‌ల పాత్ర‌ల్ని రివీల్ చేశార‌ని కూడా అనుకోవ‌డానికి లేదు. అయితే ఇలా ఓ బాలీవుడ్ భామ‌ను, హాలీవుడ్ భామ‌ను ఫైన‌ల్ చేసేయ‌డంతో మ‌న సౌత్ నాయిక‌లు ప్ర‌స్తుతం రాజ‌మౌళిపై గ‌రంగ‌రంగానే ఉంటార‌న‌డంలో సందేహం లేదు. ఈ చిత్రంపై ఎన్నో ఆశ‌లు పెట్టుకున్న కీర్తి సురేష్ కి నిరాశ త‌ప్ప‌లేదు. త‌మ‌న్నా లాంటి నాయిక‌ల‌కు అవ‌కాశం ఇవ్వ‌నందుకు వాళ్లు ఫీల‌వ్వ‌కుండా ఉంటారా?

Also Read: Live Updates:All About RRR