గానకోకిల‌కు ఎస్పీ బాలు అవార్డ్

Last Updated on by

`ది నైటింగెల్ ఆఫ్ సౌత్` ..  సీనియ‌ర్‌ గాయ‌ని జానకి బిరుది ఇది. అభిమానులు ఎంతో అభిమానంగా గాన‌కోకిల అని పిలుస్తారు. దాదాపు ఆరు ద‌శాబ్ధాల కెరీర్‌లో సుమారు 50వేల పాట‌లు పాడిన జాన‌కి తెలుగు, త‌మిళం, హిందీ, మ‌ల‌యాళం, క‌న్న‌డ స‌హా ప్ర‌పంచంలోని ఇత‌ర భాష‌ల్లోనూ పాడారు. ఉత్త‌మ గాయ‌నిగా నాలుగు సార్లు జాతీయ పుర‌స్కారం, 31 సార్లు రాష్ట్ర స్థాయి అవార్డులు అందుకున్నారు.
తాజాగా ఈ మేటి గాయ‌నికి ఎస్‌.పి.బాలసుబ్రహ్మణ్య ం జాతీయ అవార్డును ప్ర‌క‌టించారు. ప్ర‌తి ఏటా బాలు పుట్టిన రోజు వేళ ప‌లు రంగాల‌కు చెందిన ప్ర‌తిభావ‌నుల‌కు ఈ పుర‌స్కారం అందిస్తున్నారు. ఈ ఏడాది మేటి గాయ‌కురాలిగా సింగింగ్ విభాగంలో జాన‌కికి పుర‌స్కారం ద‌క్కింది.`జాన‌క‌మ్మ ఆశీస్సుల‌తో ఇంత పెద్ద గాయ‌కుడిని అయిన నాకు ఆమెను స‌త్క‌రించుకునే అవ‌కాశం రావ‌డం గొప్ప గౌర‌వంగా భావిస్తున్నాన‌ ని బాలు ఈ సంద‌ర్భ ంగా ఆనందం వ్య‌క్తం చేశారు. ఇటీవ‌లే జాన‌కి త‌న వృత్తిని విడిచి వెళుతున్నాన‌ని తెలిపారు. ఆ క్ర‌మంలోనే కోకిల గానం వీడ‌డం సాధ్య‌మా? అంటూ అభిమానులు నిర‌సించారు. ఇప్ప‌టికైనా మ్యాడ‌మ్ మ‌న‌సు మార్చుకుని తిరిగి పాడాల‌ని అభిమానులు కోరుతున్నారు. బాలు అవార్డు అయినా తిరిగి స్ఫూర్తినిస్తుందేమో

User Comments