షాక్.. మహేష్ భూమ్ భూమ్ కాపీ అంటున్నారే..?

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు లేటెస్ట్ మూవీ ‘స్పైడర్’ నుంచి భూమ్ భూమ్ అంటూ తాజాగా ఫస్ట్ సింగిల్ రిలీజ్ అయిన విషయం తెలిసిందే.
మురుగదాస్ డైరెక్ట్ చేసిన ఈ ప్రతిష్టాత్మక సినిమాకు హరీష్ శంకర్ లాంటి టాలెంటెడ్ మ్యూజిక్ డైరెక్టర్ పని చేయడంతో తాజాగా రిలీజైన సాంగ్ ఆ రేంజ్ లోనే ఉంది.
అందుకే ఇన్స్టెంట్ గా సాంగ్ సూపర్ హిట్ అయిపోయింది.
అయితే, ఇదే సమయంలో ఈ భూమ్ భూమ్ సాంగ్ ఓ ఫారిన్ సాంగ్ నుంచి కాపీ కొట్టేశారని..
హరీష్ శంకర్ దానిని యాజిటీజ్ గా దించేశారని ఆరోపణలు రావడం షాకింగ్ న్యూస్ అయింది.
ఆ స్టోరీలోకి వెళితే, అమెరికాలోని మయామీ ప్రాంతానికి చెందిన ఐదుగురు అమ్మాయిలు మొదట్లో ‘ఫిఫ్త్ హార్మనీ’ అనే బ్యాండ్ స్టార్ట్ చేయగా.. ఇప్పుడు అందులో కేవలం నలుగురు సభ్యులే ఉన్నారని సమాచారం.
ఇకపోతే, ఈ బ్యాండ్ ఆ మధ్య ‘రిఫ్లెక్షన్స్’ అనే ఆల్బమ్ కంపోజ్ చేయగా.. అందులో ‘వర్త్ ఇట్’ అనే ఒక సాంగ్ ఉంది.
ఇక ఇప్పుడు ఆ వర్త్ ఇట్ అనే సాంగ్ నే కాపీ కొట్టేసి హరీష్ జైరాజ్ మహేష్ కోసం భూమ్ భూమ్ పాటను కంపోజ్ చేశారని సోషల్ మీడియాలో చాలామంది ఆరోపిస్తున్నారు.
అయితే, ఇక్కడ తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఆ పాటకు మన స్పైడర్ పాటకు నిజానికి పెద్దగా సంబంధం లేదు.
కేవలం ఫిఫ్త్ హార్మనీ బ్యాండ్ కంపోజ్ చేసిన పాటలో ఒక సన్నాయి బిట్ మొదట్లో వచ్చి పాటంతా బ్యాక్ గ్రౌండ్ లో వినిపిస్తూ ఉండగా.. ఇప్పుడు అదే రకం సన్నాయి సౌండ్ మన భూమ్ భూమ్ పాటలో కూడా వినిపిస్తుంది.
అంతకుమించి ట్యూన్ పరంగా కూడా చాలా తేడా ఉందని విశ్లేషకులు అంటున్నారు.
అయితే, ఎలక్ట్రానిక్ సౌండ్ ద్వారా ప్రొడ్యూస్ చేసిన సన్నాయి నొక్కులు దాదాపుగా కలిసినట్లు ఉండటంతో.. కాపీ అంటూ కొంతమంది గట్టిగానే వాదిస్తున్నారు.
ఈ నేపథ్యంలో సూపర్ స్టార్ ఫ్యాన్స్ కూడా ఈ మాత్రానికే కాపీ అంటే ఎలా అంటూ సోషల్ మీడియాలో బలంగానే స్పందిస్తున్నారు.
ఇదిలా ఉంటే, సౌత్ స్టార్ మ్యూజిక్ డైరెక్టర్స్ లో ఒకరైన హరీష్ జైరాజ్ ఇప్పటికే మన థమన్ లాగ కొన్ని ఫారిన్ సాంగ్స్ ను ఆదర్శంగా తీసుకుని ట్యూన్స్ చేశారని ఇంతకుముందే వార్తలు వినిపించిన విషయం తెలిసే ఉంటుంది.
కానీ, సినిమా దర్శకులు అలా అడుగుతున్నారు కాబట్టే.. చేస్తున్నామని మ్యూజిక్ డైరెక్టర్స్ సైడ్ నుంచి సౌండింగ్ బలంగానే వినిపిస్తుంది.
అందుకేనేమో ఏదైనా సాంగ్ కాపీ అని టాక్ బయటకు రాగానే.. వీళ్లకు కాపీ కొట్టడం కొత్తేమీ కాదు కదా అని జనాలు కూడా ఫిక్స్ అయిపోతున్నారు.
అయితే, ఇప్పుడు అటుతిరిగి ఇటుతిరిగి మహేష్ బాబు ‘స్పైడర్’ లాంటి ప్రెస్టీజియస్ సినిమాకు ఈ దెబ్బ తగలడం కొంచెం ఇబ్బందికరం అనే అనాలి.
భూమ్ భూమ్ : https://www.youtube.com/watch?v=zIg9KDeLyRE
వర్త్ ఇట్ : https://www.youtube.com/watch?v=YBHQbu5rbdQ