తెలుగు తేజం అన్న‌గారి వ‌ర్ధంతి నేడు..

Last Updated on by

తెలుగు వాడు అని ఈ రోజు గ‌ర్వంగా చెప్పుకుంటున్నాం అంటే అది ఆయ‌న చేసిన కృషే. తెలుగు వాడి వేడిని ఢిల్లీ స్థాయిలో చాటిచెప్పి అక్క‌డి వాళ్ల‌ను కూడా గ‌డ‌గ‌డ‌లాడించిన తెలుగు సింహం అన్న నంద‌మూరి తార‌క‌రామారావు. ఆయ‌న దూర‌మై అప్పుడే 22 ఏళ్లు గ‌డిచిపోయింది. 1923, మే 28న నిమ్మ‌కూరులో జ‌న్మించిన ఆయ‌న‌.. జీవితం అంతా శ్ర‌మతోనే ముందుకు సాగింది. చిందే ప్ర‌తీ చెమ‌ట చుక్క‌తో త‌న క‌ల‌ల సౌధాన్ని నిర్మించుకున్నారు ఎన్టీఆర్. తెలుగు ప్ర‌జ‌ల గుండెల్లో ఎప్ప‌టికీ నిలిచిపోయే తేజం అయ్యారు అన్న‌గారు. సినిమాల్లో ఆయ‌న వేయ‌ని వేషాలు లేవు. ఎన్టీఆర్ సినిమా అంటే తెలుగు ప్రేక్ష‌కుల‌కు పండ‌గే ఆ రోజుల్లో. అన్న‌గారు సినిమా చేస్తున్నారంటే బాక్సాఫీస్ బ‌ద్ధ‌ల‌వ్వాల్సిందే. రావ‌ణుడు, ధుర్యోధ‌నుడు లాంటి విల‌న్స్ ను కూడా హీరోలుగా మార్చిన ఘ‌నత ఎన్టీఆర్ కే ద‌క్కింది. నిజానికి మ‌న‌కు రాముడు, కృష్ణుడు ఎలా ఉంటాడో తెలియ‌దు కానీ వాళ్లు అచ్చంగా ఎన్టీఆర్ లాగే ఉంటారేమో అనిపిస్తుంది.
అంత‌గా తెలుగు వాడి గుండెల్లో త‌న రూపాన్ని ముద్ర వేసాడు అన్న‌గారు.

సినిమాల్లో ఎన్ని ర‌కాల పాత్ర‌లు వేయాలో అన్నీ వేసిన అన్న‌గారు.. 1983లో రాజ‌కీయాల్లోకి వ‌చ్చారు. పార్టీ పెట్టిన 9 నెల‌ల్లోనే అధికారంలోకి వ‌చ్చి కాంగ్రెస్ సీట్ చించేసారు. తెలుగుదేశం అంటూ తెలుగు వాళ్లంద‌ర్నీ ఒక్క‌టి చేసారు నంద‌మూరి తారక‌రామారావు. ముఖ్య‌మంత్రిగా ఎన్నో అద్భుత మైన కార్య‌క్ర‌మాలు చేసి.. ప్ర‌జ‌ల‌కు రామ‌రాజ్యం అంటే ఏంటో చూపించారు. ముఖ్యమంత్రిగా ఉంటూనే అప్పుడప్పుడూ సినిమాలు కూడా చేసారు ఎన్టీఆర్. చివ‌రికి 1996, జ‌న‌వ‌రి 18న ఈ లోకాన్ని శాశ్వ‌తంగా విడిచి వెళ్లిపోయారు. ఇప్పుడు ఆయ‌న త‌న‌యుడు బాల‌కృష్ణ తండ్రి చ‌రిత్ర‌ని ప్రేక్ష‌కుల‌కు చూపించ‌బోతున్నాడు. దానికి ఎన్టీఆర్ అనే టైటిల్ క‌న్ఫ‌ర్మ్ చేసారు. తాజాగా ఎన్టీఆర్ వ‌ర్ధంతి సంద‌ర్భంగా చిత్ర ఫ‌స్ట్ లుక్ విడుద‌లైంది. టీజ‌ర్ త్వ‌ర‌లోనే విడుద‌ల కానుంది. ఈ చిత్రానికి తేజ ద‌ర్శ‌కుడు. కీర‌వాణి సంగీతం అందిస్తుంటే నంద‌మూరి బాల‌కృష్ణ సొంత ప్రొడ‌క్ష‌న్ హౌజ్ లోనే సినిమా నిర్మిస్తున్నారు. సాయికొర్ర‌పాటి కూడా మ‌రో నిర్మాత‌గా ఉన్నాడు. ఈ ఏడాదే సినిమా విడుద‌ల కానుంది.

User Comments