సాహో సెట్స్‌కి శ్ర‌ద్ధ‌గా

Last Updated on by

దాదాపు 300కోట్ల బ‌డ్జెట్‌తో అత్యంత ప్ర‌తిష్ఠాత్మ‌కంగా తెర‌కెక్కుతోంది `సాహో`. ప్ర‌భాస్ క‌థానాయ‌కుడిగా న‌టిస్తున్న ఈ చిత్రానికి సుజీత్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. యువిక్రియేష‌న్స్ సంస్థ అలుపెర‌గ‌కుండా పెట్టుబ‌డులు స‌మ‌కూరుస్తోంది. జాతీయ‌, అంత‌ర్జాతీయ స్థాయి టెక్నీషియ‌న్లు ఈ చిత్రానికి ప‌ని చేస్తున్నారు. అలాంటి ప్ర‌తిష్ఠాత్మ‌క చిత్రంలో ప్రతిదీ ఓ ఛాలెంజ్ అనే చెప్పాలి. ఆ ఛాలెంజ్‌ని స్వీక‌రించి ప్ర‌భాస్ తానేంటో నిరూపించేందుకు ఊహాతీత‌మైన ప్లాన్‌తోనే బ‌రిలో దిగాడ‌ని సాహో ఆరంభ‌మే అర్థ‌మైంది.

ఇండియాస్ మోస్ట్ వాంటెడ్ హీరోగా, దేశంలోనే అసాధార‌ణ స్టార్‌డ‌మ్ ఉన్న యాక్ష‌న్ హీరోగా త‌న‌ని తాను మ‌లుచుకునేందుకు ప్ర‌భాస్ తీవ్రంగా శ్ర‌మిస్తున్నాడు. అయితే ఇలాంటి భారీ యాక్ష‌న్ చిత్రంలో ప్ర‌తిపాత్రా దేనిక‌దే ప్ర‌త్యేకంగా ఉండాల‌ని ముందే స్క్రిప్టు డిసైడ్ చేసిందిట‌. వాస్త‌వానికి ప్ర‌భాస్ పాత్ర ఎంత మైలేజ్‌తో ఉంటుందో శ్ర‌ద్ధా క‌పూర్ పాత్ర అంతే మైలేజ్‌ని చూపిస్తుందిట‌. ఓ ర‌కంగా ఫీమేల్ పాత్ర‌తోనే సాహో క‌థ లీడ్ అవుతుంద‌ని తెలుస్తోంది. శ్ర‌ద్ధా పాత్ర ఈ క‌థ‌ను నేరేట్ చేస్తుంద‌ని ఇదివ‌ర‌కూ గల్ఫ్‌లో జ‌రిగిన ప్రెస్‌మీట్‌లో ప్ర‌భాస్ స్వ‌యంగా వెల్ల‌డించాడు. దీనిని బ‌ట్టి ఈ అమ్మ‌డి పాత్ర ఏ రేంజులో ఉంటుందో ఊహించుకోవ‌చ్చు. ఇక‌పోతే శ్ర‌ద్ధా క‌పూర్ ఇటీవ‌ల బాలీవుడ్‌లో త‌న క‌మిట్‌మెంట్లు పూర్తి చేసి, తిరిగి సాహో టీమ్‌తో జాయిన్ అయ్యింది. తిరిగి ఇక్క‌డ షూటింగ్ మొద‌లైంది. త‌న‌పై క్లాప్ కొట్టిన ఫోటోని అమ్మ‌డు సామాజిక మాధ్య‌మాల్లో షేర్ చేసింది.

User Comments