మురుగ‌దాస్‌పై శ్రీ‌రెడ్డి బుర‌ద‌

Last Updated on by

గ‌త కొంత‌కాలంగా శ్రీ‌లీక్స్ వ్య‌వ‌హారం పెనుప్ర‌కంప‌నాల‌కు కార‌ణ‌మైన సంగ‌తి తెలిసిందే. సుచీలీక్స్ వ‌ర్సెస్ శ్రీ‌లీక్స్ అంటూ యూత్ పండుగ చేసుకున్నారు. కోలీవుడ్ బూతు సినిమాని మించి టాలీవుడ్ బూతు సినిమాని చూపించింది శ్రీ‌రెడ్డి. మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేష‌న్ (మా)లో స‌భ్య‌త్వం ఇవ్వ‌ని కార‌ణంగా .. త‌న‌కు అవ‌కాశాలు ఇవ్వ‌కుండా అన్యాయం చేశారంటూ శ్రీ‌రెడ్డి ఉద్య‌మం ప్రారంభించింది. అయితే శ్రీ‌రెడ్డి ఎటాక్‌తో టాలీవుడ్ ప‌రువు జాతీయ అంత‌ర్జాతీయ స్థాయిలో గంగ‌పాలైంది. ప‌లువురు ద‌ర్శ‌క‌హీరోల పేర్లు బ‌య‌ట‌పెడుతూ శ్రీ‌రెడ్డి చేసిన ఆరోప‌ణ‌ల్ని జాతీయ మీడియా ప్ర‌ధానంగా హైలైట్ చేసింది. ఆ క్ర‌మంలోనే శ్రీ‌రెడ్డికి అస‌లే అవ‌కాశాలు రాకుండా దారులు మూసుకుపోయాయ‌ని, త‌న‌ని టాలీవుడ్ విధివంచిత‌ను చేసింద‌న్న చ‌ర్చ తెర‌పైకొచ్చింది.

అదంతా అటుంచితే.. ఇంత‌జ‌రిగినా శ్రీ‌రెడ్డి మాత్రం మార‌లేదు. ఇంకా ఇంకా ప‌లువురు ప్ర‌ముఖుల పేర్లు బ‌య‌ట‌పెడుతూనే ఉంది. నాని, శేఖ‌ర్ క‌మ్ముల‌, కొర‌టాల శివ వంటి ప్ర‌ముఖుల్ని టార్గెట్ చేసిన శ్రీ‌రెడ్డి ఇప్పుడు కోలీవుడ్ స్టార్ డైరెక్ట‌ర్ మురుగ‌దాస్‌పైనా తీవ్ర ఆరోప‌ణ‌లు గుప్పించింది. వెలిగొండ శ్రీ‌నివాస్ అనే ర‌చ‌యిత ద్వారా మురుగ‌దాస్ శ్రీ‌రెడ్డిని ఓ స్టార్ హోట‌ల్లో క‌లిసాన‌ని శ్రీ‌రెడ్డి బాంబ్ వేసింది. ఫేస్‌బుక్‌లో ఈ ఆరోప‌ణలు చేసింది. అప్పుడు త‌న‌కు ఒక రోల్ ఇస్తాన‌ని ప్రామిస్ చేసిన మురుగ‌దాస్ త‌న‌కు అవ‌కాశాలివ్వ‌లేద‌ని ఆరోపించింది. అయితే శ్రీ‌రెడ్డి ఆరోప‌ణ‌ల్లో ప్ర‌ధాన‌మైన హైలైట్‌.. మురుగ‌దాస్ ఏ ఉద్దేశంతో హోట‌ల్‌కి ర‌మ్మ‌న్నాడు? మురుగ‌దాస్ హోట‌ల్‌కి ర‌మ్మన్నాడంటే అర్థం ఏంటి? అంటూ స‌ర్వ‌త్రా ఆస‌క్తిక‌ర చ‌ర్చ సాగుతోంది. ఈ విష‌యంలో జ‌నం శ్రీ‌రెడ్డిని న‌మ్ముతారా? అస‌లింత‌కీ శ్రీ‌రెడ్డి బ‌య‌ట‌పెట్టిన ప్ర‌ముఖులంతా అలా చేశారా? జ‌నాల‌కు ఇప్ప‌టికీ ఓ ఫ‌జిల్. దీనిపై మురుగ స్పందిస్తాడా? స‌్పందిస్తే ఏం వివ‌ర‌ణ ఇస్తాడో చూడాలి.

User Comments