Last Updated on by
కుక్కతోక వంకర అని ఊరికే అనలేదు పెద్దలు. గొట్టంలో పెట్టినంత సేపే ఆ తోక చక్కగా ఉంటుంది. అది తీస్తే మళ్లీ పాత వంకరే. బుద్ధి కూడా వంకరే. ఇప్పుడు శ్రీరెడ్డిని చూస్తుంటే కూడా ఇదే అనిపిస్తుంది. ఆ మధ్య పవన్ కళ్యాణ్ ను టార్గెట్ చేసి అనరాని బూతులు కూడా అన్న ఈ భామ.. ఆ తర్వాత ఏమైందో కానీ సడన్ గా మనసు మార్చుకుని పవన్ మంచోడు.. ఆయన్ని గెలిపిద్దాం అంది. అమ్మో ఈమె బుర్రకు ఎవరో మర్ధన చేసినట్లున్నారు.. కాస్త తేడాగా మాట్లాడుతుంది అనుకున్నారంతా. కానీ ఇప్పుడు ట్రాక్ లోకి వచ్చింది శ్రీరెడ్డి. తాజాగా మరోసారి పవన్ కళ్యాణ్ ను టార్గెట్ చేసింది ఈ భామ. ఈ సారి ఏకంగా పెద్ద ఇష్యూనే తీసుకొచ్చింది.
ఈ మధ్యే ఓ మీటింగ్ లో తమ ఇంటి 16 ఏళ్ల పాపను తీసుకెళ్లి కాంగ్రెస్ నాయకులు జాతీయ ఛానెల్స్ లో కూర్చోబెట్టారు.. ఏమీ తెలియని అమ్మాయి పరువు తీసారు అంటూ విరుచుకుపడ్డాడు. అప్పట్లో శ్రీజ ఇంట్లో నుంచి పారిపోయి కోరుకున్న వాన్ని పెళ్లి చేసుకుంది. దాంతో ఇప్పుడు శ్రీరెడ్డి దీనిపై కౌంటర్ వేసింది. అంత పని చేసిన కాంగ్రెస్ ని తిట్టకుండా.. మళ్లీ అదే పార్టీలో తన పార్టీని మీ అన్న ఎందుకు కలిపారు.. ఇప్పటికీ అదే పార్టీలో ఎందుకు ఉన్నారు పవన్ గారు కాస్త చెప్పండి మాకు అంటూ సెటైర్లు వేసింది. తన అభిమానులను నీకెందుకు ఓట్లు వేయడానికి ఇప్పుడు ప్రేరేపిస్తున్నాడు చెప్పు పవన్ కళ్యాణ్ అంటూ నిలదీసింది శ్రీరెడ్డి. ఈమె మాటలకు ఎప్పట్లాగే మళ్లీ రివర్స్ కౌంటర్స్ మొదలయ్యాయి.
User Comments