శ్రీరెడ్డి ఇంటిపై దుండ‌గులు దాడి!

Last Updated on by

గ‌త కొన్నినెలలుగా శ్రీరెడ్డి చెన్నైలో తిష్ట వేసిన సంగ‌తి తెలిసిందే. ప్రస్తుతం కోలీవుడ్ సినిమాల్లో న‌టిస్తోంది. దీనిలో భాగంతా ఆమె బ‌యోపిక్ రెడ్డి డైరీస్ టైటిల్ తో తెర‌కెక్కుతోంది. అయితే కాస్టింగ్ కౌచ్ లో భాగంగా కోలీవుడ్ హీరోల‌పై కూడా ఆరోప‌ణ‌లు గుప్పించింది. ఈ నేప‌థ్యంలో రివ‌ర్స్ కౌంట‌ర్లు ఎదుర్కోంది. ఇవేమి ఆమెపై పెద్ద‌గా ప్ర‌భావం చూప‌లేదు. అయితే ఇటీవ‌లే పొల్లాచ్చిలో సెక్స్ రాకెట్ పై ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేసింది. ఈ రాకెట్ లో ఎంతో మంది అమాయక అమ్మాయిలు బ‌లైపోయార‌ని, అందులో త‌మిళ రాజ‌కీయ నేతులు ఉన్నారంటూ ఆరోప‌ణ‌లు చేసింది. దీంతో ఆమె ఉంటోన్న ఇంటిపై అర్ధ‌రాత్రి దుండ‌గ‌లు దాడిచేసిన‌ట్లు ఆల‌స్యంగా వెలుగులో కి వ‌చ్చింది.

శ్రీరెడ్డి తృటిలో దాడి నుంచి త‌ప్పించుకుందిట‌. దీంతో ఆమె వ‌ల‌స‌ర‌వాక్కం పోలీస్ స్టేష‌న్ లో ఫిర్యాదు చేసింది. ప్ర‌స్తుతం పోలీసులు కేసు నమోదు చేసి ద‌ర్యాప్తు చేస్తున్నారు. అయితే దాడి అనంత‌రం శ్రీరెడ్డి ఇలాంటి వాటికి భ‌య‌ప‌డే దాన్ని కాద‌ని, ఇవ‌న్నీ తాటాకు చ‌ప్పుళ్ల‌తో స‌మాన‌మం అని వ్యాఖ్యానించింది. పొల్లాచ్చి సెక్స్ రాకెట్ వ్వ‌వ‌హారాన్ని బ‌ట్ట‌బ‌య‌లు చేస్తాన‌ని ఈ సంద‌ర్భంగా మ‌రోసారి హెచ్చ‌రిందింది. దీంతో మ‌రోసారి అమ్మ‌డు కోలీవుడ్ స‌హా త‌మిళ‌నాడు ప్ర‌జానీకంలో హాట్ టాపిక్ అయింది.

After Read: After Lakshmi Bai Its Jayalalitha

User Comments