సెగ‌లు పుట్టిస్తోన్న శ్రీ‌దేవి కూతుళ్లు..

శ్రీ‌దేవి.. అందానికి మారుపేరు.. ఇండియ‌న్ సినిమా ఇండ‌స్ట్రీలో 20 ఏళ్ల పాటు చ‌క్రం తిప్పిన బ్యూటీ. బాల‌న‌టిగా ఎంట‌రై.. హీరోయిన్ గా అంద‌రి మ‌న్న‌న‌లు అందుకున్న ముద్దుగుమ్మ‌. వ‌యసు 50కి పైబ‌డినా ఇప్ప‌టికీ అతిలోక‌సుంద‌రి అంటే శ్రీ‌దేవే. ఈమె ఇప్పుడు త‌న కూతుళ్ల‌ను ఇండ‌స్ట్రీకి ప‌రిచ‌యం చేసే ప‌నిలో ఉంది. దీనికి స‌న్నాహ‌కంగా ఈ మ‌ధ్య ఎక్క‌డికి వ‌చ్చినా కూతుళ్లతోనే ద‌ర్శ‌న‌మిస్తుంది శ్రీ‌దేవి.

మామూలుగా అయితే ప‌ర్లేదు.. ఇండ‌స్ట్రీలో అవ‌కాశాలు రావాలంటే ఎలా ఉండాలో శ్రీ‌దేవి కంటే ఎవ‌రికి ఎక్కువ తెలుసు..? అందుకే ఎక్క‌డికి వ‌చ్చినా కూతుళ్ల‌కు మ‌రీ చిట్టిచిట్టి క్యాస్ట్యూమ్స్ వేసుకుని తీసుకొస్తుంది శ్రీ‌దేవి.

కెమెరా క‌ళ్లన్నీ త‌న కూతుళ్లపై త‌ప్ప మరెక్క‌డా ఫోక‌స్ కాకూడ‌ద‌ని ఫిక్సైపోతుంది ఈ ముద్దుగుమ్మ‌. దానికితోడు జాన్వి.. ఖుషీ క‌పూర్లు కూడా ఇప్పుడిప్పుడే లోక‌జ్ఞానం అర్థం చేసుకుంటున్నారు. ఇండ‌స్ట్రీలో అవకాశాలు రావాలంటే సూప‌ర్ స్టార్ డ‌మ్ ఉన్నా.. వార‌స‌త్వం ఉన్నా కూడా అందాల ఆర‌బోత కూడా క‌న్ఫ‌ర్మ్ అని తెలుసుకున్నారు ఈ అక్కా చెల్లెళ్లు. అందుకే వాళ్లు కూడా సెగలు పుట్టించేస్తున్నారు. ఇప్ప‌టికే జాన్వి క‌పూర్ అందాల ఆర‌బోత చూసాం..

కానీ ఇప్పుడు శ్రీ‌దేవి చిన్న‌కూతురు ఖుషీ క‌పూర్ కూడా బికినీ విందు ఇచ్చింది. మ‌రీ ఇంత ఓవ‌ర్ ఎక్స్ పోజింగా అంటూ అంతా నోరెళ్ల‌బెట్టేలా శ్రీ‌దేవి కూతుళ్లు గ్లామ‌ర్ షో చేస్తున్నారు. మొత్తానికి హీరోయిన్ గా ఇంకా ఎంట్రీ ఇవ్వ‌క‌ముందే ఇద్ద‌రూ సెగ‌లు పుట్టించేస్తున్నారు.