శ్రీ‌దేవి మ‌ర‌ణం కూడా మిస్ట‌రీనేనా..?

Last Updated on by

Last updated on March 8th, 2018 at 01:13 pm

ఈ రోజుల్లో ఓ స్టార్ చ‌నిపోతే సాధార‌ణ మ‌ర‌ణంగా భావించ‌డం క‌ష్ట‌మైపోయింది. ఎవ‌రు చ‌నిపోయినా అందులో ఏదో మ‌ర్మం ఉంద‌ని ఊహిస్తున్నారు. ఇప్పుడు శ్రీ‌దేవి విష‌యంలోనూ ఇదే జ‌రుగుతుంది. రెండు రోజులుగా ఈమెది హార్ట్ ఎటాక్ అని.. సాధార‌ణ మ‌ర‌ణం అని వినిపించింది. కానీ స‌డ‌న్ గా సీన్ లోకి హార్ట్ ఎటాక్ కాదు.. బాత్ ట‌బ్ లో జారిప‌డి చ‌నిపోయిందంటూ వార్త‌లొచ్చాయి. దాని ప్ర‌కార‌మే ఫోరెన్సిక్ రిపోర్ట్ కూడా ఇచ్చారు. దాంతో మ‌రో రోజు కూడా శ్రీ‌దేవి భౌతిక‌కాయం దుబాయ్ లోనే ఉండాల్సిన ప‌రిస్థితి. శ్రీ‌దేవి బాడీ ఫిబ్ర‌వ‌రి 26 న వస్తుందనుకొన్నారు కానీ రావ‌డం లేదు. దాంతో పాటు శ్రీ‌దేవి భ‌ర్త బోనీక‌పూర్ కూడా దుబాయ్ లోనే ఉండాల్సిన ప‌రిస్థితి. ఆయ‌న్ని ప్ర‌స్తుతం అక్క‌డి పోలీసులు విచారిస్తున్నారు. శ్రీ‌దేవిది స‌హ‌జ మ‌ర‌ణం కాదేమో అనే అనుమానాలు కూడా అక్క‌డ వ‌స్తున్నాయి.

దాంతో అత‌డి కాల్ డేటాను.. శ్రీ‌దేవి కాల్ డాటాను కూడా విచారిస్తున్నారు. అస‌లేం జ‌రిగింది.. ఆ రోజు రాత్రి ఎందుకు శ్రీ‌దేవికి బోనీకపూర్ స‌ర్ ప్రైజ్ పార్టీ ఇవ్వాల‌నుకున్నాడు.. ఇవ‌న్నీ పారదర్శకంగా ప‌రిశీలిస్తున్నారు దుబాయ్ పోలీసులు. ఇవ‌న్నీ పూర్తైతే కానీ బోనీ ఇండియాకు రాడు. ఇక్క‌డ మ‌రో ట్విస్ట్ ఏంటంటే.. ఆ విచార‌ణ జ‌రిగినంత సేపు కూడా శ్రీ‌దేవి భౌతిక‌కాయం కూడా అక్క‌డే ఉండాలి. దాంతో ఇప్పుడు ముంబైకి శ్రీ‌దేవి డెడ్ బాడీ ఎప్పుడు వ‌స్తుందో పూర్తిగా తెలియ‌ని ప‌రిస్థితి. బాత్ టబ్ లో చ‌నిపోయింది కాబ‌ట్టి లోపల గొల్లెం కూడా ఉంది కాబ‌ట్టి బోనీక‌పూర్ ఇందులో ఎలాంటి కుట్ర చేయ‌లేద‌ని అర్థ‌మ‌వుతుంది. కానీ దుబాయ్ పోలీసుల‌కు ఇప్పుడు వేర్వేరు అనుమానాలు కూడా వ‌స్తున్నాయి. దాంతో స‌హ‌జ మ‌ర‌ణం కాస్తా ఇప్పుడు మిస్ట‌రీ మ‌ర‌ణంగా మారే అవ‌కాశం లేక‌పోలేదు. మొత్తానికి మ‌రో స్టార్ డెత్ కూడా మిస్ట‌రీగా మార‌బోతుంద‌న్న‌మాట‌.

User Comments