శ్రీ‌దేవి పేరు మీద ఉన్న ఇన్సూరెన్స్ నిజమేనా..?

Last Updated on by

Last updated on March 8th, 2018 at 01:10 pm

ఎవ‌రైనా ఉన్న‌పుడు వాళ్ల విలువ తెలియ‌దు. పోయిన త‌ర్వాతే వాళ్ల గురించి త‌లుచుకుని ఏడుస్తుంటారు. ఇప్పుడు శ్రీ‌దేవి ఫ్యామిలీ ప‌రిస్థితి కూడా ఇలాగే ఉంది. ఆమె ఉన్న‌పుడూ ఏ రోజు కూడా సంతోషంగా లేద‌ని ఆమె స‌న్నిహితులే చెబుతున్నారు. బ‌తికి ఉన్నంత కాలం.. త‌న జీవితం మొత్తం త‌న వాళ్ల కోస‌మే త్యాగం చేసిన త్యాగ‌శీలి శ్రీ‌దేవి అంటున్నారంతా. ఇప్పుడు ఆమె పోయింది.. వెళ్లిపోయింది.. తిరిగిరాని లోకాల‌కు వెళ్లిపోయింది.. మ‌ళ్లీ ఎప్ప‌టికీ రాదు. ఇప్పటి వ‌ర‌కు శ్రీ‌దేవి కుటుంబం అంతా ఆమెపైనే ఆధార‌ప‌డి ఉంది. ఆమె పిఆర్ వ‌ల్లే ఇన్నాళ్లూ ఆ కుటుంబానికి బాలీవుడ్ లో అంత వ్యాల్యూ. ఆమెపై ఉన్న గౌర‌వ‌మో.. లేదంటే క్రేజో.. అదీ కాదంటే అభిమాన‌మో తెలియ‌దు కానీ పెద్ద పెద్ద నిర్మాణ సంస్థ‌లు కూడా శ్రీ‌దేవి కోసం పోటీ ప‌డ్డాయి.

ఆమె కూతురు ఝాన్విని ప‌రిచ‌యం చేయ‌డానికి కూడా మూడేళ్లు ఆగి.. పెద్ద నిర్మాణ సంస్థ‌లు అడిగినా కూడా చివ‌రికి చాలా ఆలోచించి క‌ర‌ణ్ జోహార్ చేతుల్లో పెట్టింది. ఇప్పుడు ఆ సినిమా విడుద‌ల కాకుండానే చ‌నిపోయింది శ్రీ‌దేవి. కానీ ఇప్పుడు శ్రీ‌దేవే లేదు. ఈ స‌మ‌యంలో శ్రీ‌దేవి కూతుళ్ల భ‌విష్య‌త్తు ఎలా ఉంటుందో ఆస‌క్తిక‌రంగా మారింది. హేమామాలిని కూతుళ్ల‌నే ఇప్పుడు ప‌ట్టించుకునే వాళ్లు లేరు. మ‌రి శ్రీ‌దేవి లేదిప్పుడు.. ఆమె కూతుళ్ల‌ను ప‌ట్టించుకుంటారా..? ఇక ఆర్థికంగా కూడా ఇన్నాళ్లూ శ్రీ‌దేవి పుణ్య‌మా అని బోనీ క‌పూర్ కూడా హాయిగానే ఉన్నాడు. చ‌నిపోయే ముందు ఈమె కుటుంబం కొన్ని ఆర్థిక ఇబ్బందుల్లో ఉంద‌నే వార్త‌లున్నాయి. మ‌రి ఇప్పుడు శ్రీ‌దేవి లేని స‌మ‌యంలో వాళ్ల కుటుంబం ఎలా మార‌బోతుందో..? అన్న‌ట్లు ఈమె పేరు మీద 100 కోట్ల ఇన్సూరెన్స్ ఉంద‌ని తెలుస్తుంది. మ‌రి అది ఎవ‌రికి వెళ్తుందో చూడాలిక‌..!

User Comments