శ్రీదేవి ఫ్యాన్స్ ను ఇబ్బంది పెడుతున్న దుబాయ్ రూల్స్

Last Updated on by

ఇప్పుడు అంద‌రి క‌ళ్ళు శ్రీ‌దేవి పార్థివ‌దేహంపైనే ఉన్నాయి. ఆమె మ‌ర‌ణించి కూడా 36 గంట‌లు దాటేసింది. అయినా ఇప్ప‌టి వ‌ర‌కు ఇండియాకు ఆమె భౌతిక‌కాయం రాలేదు. దుబాయ్ రూల్స్ స్ట్రిట్ గా ఉంటాయ‌ని తెలుసు కానీ మ‌రీ ఇంత స్ట్రిక్ట్ గా ఉంటాయ‌ని మాత్రం ఇప్పుడిప్పుడే అర్థ‌మ‌వుతుంది. అక్క‌డ చ‌నిపోయింది మామూలు వ్య‌క్తి కాదు.. క్వీన్ ఆఫ్ ఇండియ‌న్ సినిమాగా పేరు తెచ్చుకున్న శ్రీ‌దేవి. అంత పెద్ద సెలెబ్రెటీ చ‌నిపోతే కూడా దుబాయ్ రూల్స్ ఇంత ట‌ఫ్ గా ఉంటాయ‌ని ఎవ‌రూ అనుకోలేదు. వీలైనంత త్వ‌ర‌గానే ఇండియాకు ఆమె బాడీని పంపిస్తార‌నే అనుకున్నారంతా. కానీ అక్క‌డ అవేం ప‌నిచేయ‌లేదు. ఎన్ని ప‌రిచ‌యాలు ఉన్నా కూడా దుబాయ్ రూల్స్ ముందు త‌ల‌వంచ‌క త‌ప్ప‌లేదు. ఇప్పుడిప్పుడే అన్నీ పూర్త‌వుతున్నాయి.
Sridevi Funeral Delayed Mortal remainsశ్రీ‌దేవి బాడీకి ఇప్ప‌టికే పోస్ట్ మార్టం పూర్త‌యింది. డాక్ట‌ర్లు ఫోరెన్సిక్ రిపోర్ట్ ఇంకా ఇవ్వ‌లేదు. అది వ‌స్తే కానీ బాడీ తీసుకెళ్ల‌డానికి వీలు కాదు. దాంతో పాటు ఇంకా చాలా రూల్స్ ఉంటాయి అక్క‌డ‌. ఇప్ప‌టికే చ‌నిపోయి రెండు రోజులు కావొస్తుంది కాబ‌ట్టి బాడీ నుంచి స్మెల్ రాకుండా ఎంబాల్మింగ్ చేస్తారు. దానికి కూడా మ‌రో గంట‌న్న‌ర ప‌డుతుంది. ఇవ‌న్నీ అయిపోయే స‌రికి దుబాయ్ టైమ్ ప్ర‌కారం 11.30 అంటే.. ఇండియ‌న్ టైమ్ ప్ర‌కారం మ‌ధ్యాహ్నం 2 అవుతుంది. ఈ లెక్క‌న ఫిబ్ర‌వ‌రి 26 రాత్రి లోపు శ్రీ‌దేవి భౌతిక‌కాయం ఇండియాకు రానుంది.Sridevi Funeral Delayed Mortal remainsదుబాయ్ రూల్స్ చాలా క‌ఠినంగా ఉంటాయి. ఇప్పుడు శ్రీ‌దేవి చ‌నిపోయింది కాబ‌ట్టి పోలీసుల ఇన్వాల్వ్ మెంట్ కూడా చాలా ఉంటుంది. ఆమె పాస్ పోర్ట్ ను అక్క‌డి ఎయిర్ పోర్ట్ ఆఫీసర్స్ క్యాన్సిల్ చేయాలి. దానికితోడు ఇండియ‌న్ కన్సోలేట్ నుంచి కూడా శ్రీ‌దేవి పాస్ట్ పోర్ట్ క్యాన్సిల్ అయిన‌ట్లు క్లియ‌ర్ స‌ర్టిఫికేట్ ఇష్యూ కావాలి. ఇవ‌న్నీ జ‌రిగిన త‌ర్వాత కానీ శ్రీ‌దేవికి డెత్ సర్టిఫికేట్ ఇష్యూ కాదు పోలీసుల నుంచి. ఆ స‌ర్టిఫికేట్ వ‌చ్చిన త‌ర్వాతే శ్రీ‌దేవి బాడీ ముంబైకు వ‌స్తుంది. ఈ ప్రాసెస్ అంతా జ‌ర‌గ‌డానికి మ‌రో మూడు నుంచి నాలుగు గంట‌లు ప‌ట్ట‌డం ఖాయం. ఈ లెక్క‌న ఫిబ్ర‌వ‌రి 27నే శ్రీ‌దేవి అంత్య‌క్రియ‌లు జరిగే అవకాశాలున్నాయి.

User Comments