శ్రీ‌దేవి ఫ్యామిలీ ప్ర‌ట‌కన విడుద‌ల చేసింది

Last Updated on by

ఇక శ్రీ‌దేవి క‌నిపించ‌దు. ఈ లోకం నుంచి వెళ్లిపోయి నాలుగు రోజులు గ‌డిచినా కూడా ఇప్ప‌టి వ‌ర‌కు చూసుకోడానికి ఆమె రూపం మాత్రం మ‌న క‌ళ్ళ ముందే ఉంది. దానికి కూడా ఇప్పుడు స‌మ‌యం ఆస‌న్న‌మైంది. ఫిబ్ర‌వ‌రి 27 రాత్రి 10 గంట‌లకు ఇండియాకు శ్రీ‌దేవి భౌతిక‌కాయం దుబాయ్ నుంచి రానుంది. ఇప్ప‌టికే అక్క‌డ్నుంచి బ‌య‌ల్దేరింది కూడా. వ‌చ్చిన త‌ర్వాత ఫిబ్ర‌వ‌రి 28న శ్రీ‌దేవి అంత్య‌క్రియ‌లు జ‌ర‌గ‌నున్నాయి. దీనికి సంబంధించిన ఓ ప్ర‌ట‌కన విడుద‌ల చేసింది శ్రీ‌దేవి ఫ్యామిలీ. బాధ‌తో నిండిపోయిన హృద‌యాల‌తో శ్రీ‌దేవి భర్త బోనీ కపూర్‌, కుమార్తెలు ఖుషి, జాహ్నవితో పాటు కపూర్‌, అయ్యప్పన్ కుటుంబ సభ్యులంతా మీడియాకు కృతజ్ఞతలు తెలిపారు. అలాగే శ్రీదేవి అంత్యక్రియల వివరాలు కూడా చెప్పారు.

బుధవారం అంటే ఫిబ్ర‌వ‌రి 28 ఉద‌యం 9.30 గంటల నుంచి 12.30 గంటల వరకూ ప్రజల సందర్శనార్థం శ్రీదేవి భౌతికకాయాన్ని సెలబ్రేషన్ స్పోర్ట్స్‌ క్లబ్‌లో ఉంచుతారు. అదే స‌మ‌యంలో శ్రీ‌దేవి క‌డ‌సారి చూపుల కోసం చాలా మంది ప్ర‌ముఖులు రానున్నారు. దాంతో ఆ ఏరియా మొత్తం ఇప్ప‌టికే పోలీసుల అదుపులోకి వెళ్లిపోయింది. ఆ త‌ర్వాత 2 గంటల నుంచి అంతిమ యాత్ర మొదలు కానుంది. మధ్యాహ్నం 3.30 గంటల నుంచి విలే పార్లే సేవా సమాజ్‌ హిందూ శ్మశానవాటికలో అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు తెలిపారు. మొత్తానికి మ‌రికొన్ని గంట‌ల్లో ఆమె రూపం కూడా ఈ లోకంలోంచి వెళ్లిపోతుంద‌న్న‌మాట‌.

User Comments