శ్రీ‌దేవి కి కన్నీటి వీడ్కోలు

Last Updated on by

50 ఏళ్లు ప్రేక్ష‌కుల్ని త‌న అందాల‌తో ఓల‌లాడించిన అందాల శ్రీ‌దేవి వెళ్లిపోయింది. ఇక ఇప్పుడు ఆమె రూపం కూడా మ‌న‌కు క‌నిపించ‌దు. ఇక‌పై ఫోటోలు.. వీడియోల్లోనే శ్రీ‌దేవిని చూసుకోవాలి. ఇన్నేళ్ల ఆమె రూపం ఇప్పుడు అనంత‌లోకాల‌కు వెళ్లిపోయింది. శ్రీ‌దేవి అంత్య‌క్రియలు ముంబైలోని విల్లేపార్లే స్మ‌శాన వాటిక‌లో జ‌రిగాయి. భ‌ర్త బోనీక‌పూర్ తో పాటు అనిల్ క‌పూర్.. సంజ‌య్ క‌పూర్.. శ్రీ‌దేవి స‌మితి కొడుకు అర్జున్ క‌పూర్ తో పాటు కుటుంబ స‌భ్యులంతా శ్రీ‌దేవి అంత్య‌క్రియ‌ల్లో పాల్డొన్నారు. సెలెబ్రేష‌న్స్ స్పోర్ట్స్ క్ల‌బ్ నుంచి విల్లె పార్లే స్మ‌శాన వాటిక వ‌ర‌కు జ‌న‌సందోహంలో ముంబై రోడ్ల‌న్నీ నిండిపోయాయి. ఇసుకేస్తే రాల‌నంత జ‌నం అంటారు క‌దా.. అలా వ‌చ్చారు శ్రీ‌దేవి కోసం అభిమానులు.Sridevi Kapoor Funeral Updates Last Rites In Mumbaiటాలీవుడ్ నుంచి కూడా చిరంజీవి, వెంక‌టేష్, సురేష్ బాబు స‌హా చాలా మంది వెళ్లారు. ఇక క‌మ‌ల్, ర‌జినీ కూడా శ్రీ‌దేవి అంత్య‌క్రియ‌ల్లో పాల్గొన్నారు. మొత్తానికి ఓ అందాల రూపం ఈ లోకం నుంచి శాశ్వ‌తంగా వెళ్లిపోయింది. ఇక మ‌ళ్లీ చూడాల‌న్నా చూడ‌లేనంత దూరం ప‌య‌నమైపోయింది. 54 ఏళ్ల జీవితంలో 50 ఏళ్లు సినీ క‌ళామ త‌ల్లికి అంకితం చేసి.. త‌న బ‌తుకు కూడా మ‌ర్చిపోయి త‌న వాళ్ల కోసమే బ‌తికిన ఓ మ‌హామనిషి వెళ్లిపోయింది. ఇక సెల‌వు అంటూ తిరిగిరాని లోకాల‌కి అతిలోక‌సుంద‌రి ప‌య‌నం ముగిసిపోయింది.

User Comments