శ్రీ‌దేవి సీక్రెట్స్ లీక్ చేసే బుక్‌

అతిలోక సుంద‌రి శ్రీ‌దేవి ఆక‌స్మిక మ‌ర‌ణం అభిమానుల్ని కకావిక‌లం చేసిన సంగ‌తి తెలిసిందే. ఈ ఏడాది ఆరంభం దుబాయ్‌లో జ‌రిగిన ఓ పెళ్లి వేడుక‌లో శ్రీ‌దేవి హ‌ఠాన్మ‌ర‌ణం ప‌లు సందేహాల‌కు తావిచ్చింది. ఇప్ప‌టికీ శ్రీ‌దేవి మ‌ర‌ణం ఓ మిస్ట‌రీ అనే అభిమానులు న‌మ్ముతున్నారు. అదంతా అటుంచితే.. శ్రీ‌దేవి జీవితంలోని ప‌లు సీక్రెట్స్ ని రివీల్ చేసే ఓ పుస్త‌కం త్వ‌ర‌లో రిలీజవుతోంది. ఈ పుస్త‌కాన్ని సీనియ‌ర్ సినీజ‌ర్న‌లిస్ట్ ప‌సుపులేటి రామారావు `అతిలోక సుంద‌రి శ్రీదేవి క‌థ‌` పేరుతో ర‌చించారు. త్వ‌ర‌లోనే రిలీజ్‌కి స‌న్నాహాలు చేస్తున్నారాయ‌న‌.

ఈ పుస్త‌కంలో ఎలాంటి విష‌యాలు ఉంటాయి? అంటే.. శ్రీ‌దేవికి సంబంధించి ప‌లు సీక్రెట్స్‌ని ఆయ‌న లీక్ చేస్తున్నార‌ట‌. బాల‌న‌టిగా సినీజ‌గ‌త్తులో ప్ర‌వేశించిన శ్రీ‌దేవికి కెరీర్ ఆద్యంతం ఏఏ ద‌ర్శ‌కులు బ్యాక్‌బోన్‌గా నిలిచారు? సినీహీరోల‌తో శ్రీ‌దేవి సాన్నిహిత్యం ఎలాంటిది? బోనీ క‌పూర్‌ని పెళ్లాడ‌క ముందు శ్రీ‌దేవి జీవితంలోని సంఘ‌ర్ష‌ణ ఎలాంటిది? హీరో మిథున్ చ‌క్ర‌వ‌ర్తితో ప్రేమ‌వ్య‌వ‌హారం.. అటుపై సీక్రెట్ పెళ్లి.. మెగాస్టార్ చిరంజీవి హీరోగా శ్రీ‌దేవి సినిమా నిర్మించాల‌ని అనుకున్నారా? ఇలా ప్ర‌తిదీ ఈ పుస్త‌కంలో లీక్ చేస్తున్నార‌ట‌. ఈ పుస్త‌కాన్ని ఆవిష్క‌రించేందుకు ఇప్ప‌టికే టాలీవుడ్ స్టార్ హీరోయిన్ స‌మంత‌ను సంప్ర‌దించారు. సామ్ అందుకు అంగీకారం తెలిపార‌ట‌. ఈ వారంలోనే పుస్త‌కావిష్క‌ర‌ణ కార్య‌క్ర‌మం ఉంటుంద‌ని తెలుస్తోంది. ప‌సుపులేటి ప‌బ్లికేష‌న్స్ పేరుతో జ‌ర్న‌లిస్ట్ ప‌సుపులేటి రామారావు ఈ పుస్త‌కాన్ని మార్కెట్లోకి తెస్తున్నారు. ఆయ‌న ర‌చించిన‌ చిరంజీవితం 150, వెండితెర విషాద రాగాలు, అద్భుత న‌టి సావిత్రి వంటి పుస్త‌కాలు ఇప్ప‌టికే మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. మ‌ద్రాసులో సినీప‌రిశ్ర‌మ వేళ్లూనుకున్న రోజుల్లో ప‌సుపులేటి అక్క‌డ జ‌ర్న‌లిస్టుగా ప‌ని చేశారు. టాలీవుడ్ హైద‌రాబాద్‌లో విస్త‌రించిన క్ర‌మంలోనూ జ‌ర్న‌లిస్టుగా కొన‌సాగి ఎంద‌రో యువ జ‌ర్న‌లిస్టుల‌కు స్ఫూర్తిగా నిలిచారు. ప్ర‌స్తుతం ఆయ‌న `సంతోషం` సినీమ్యాగ‌జైన్‌లో జ‌ర్న‌లిస్టుగా కొన‌సాగుతున్నారు.