షాక్‌: శ్రీ‌దేవి ప్రీప్లాన్డ్ మ‌ర్డ‌ర్‌?

Last Updated on by

శ్రీ‌దేవి ఆక‌స్మిక మ‌ర‌ణం వెన‌క ఏదో దాగి ఉంది… అదేదో దాస్తున్నారు! ఇదో డెత్ మిస్ట‌రీ!! అన్న సందేహం ఇప్ప‌టికీ అభిమానుల్లో స‌జీవంగా ఉంది. ఉన్న‌ట్టుండి స్నానాల గ‌ది(బాత్ ట‌బ్‌)లో విగ‌త‌జీవిగా ప‌డి ఉన్న శ్రీ‌దేవిని చూపించి, యాక్సిడెంట‌ల్ డెత్‌గా మ‌ర‌ణించింద‌ని స‌న్నివేశం క్రియేట్ చేశార‌ని ఫ్యాన్స్ ఇప్ప‌టికీ న‌మ్ముతున్నారు. దేశ స‌ర్వోన్న‌త న్యాయ‌స్థానం సుప్రీం అంగీక‌రించ‌క‌పోయినా, దుబాయ్ చ‌ట్టాలు అది అనుకోని యాక్సిడెంట్ అని ధ్రువీక‌రించినా ఇంకా ఇంకా ఏదో అప‌న‌మ్మ‌కం అభిమానుల్ని వెంటాడుతూనే ఉంది.

ఇదివ‌ర‌కూ సునీల్ సింగ్ అనే వీరాభిమాని సుప్రీంలో స‌మ‌గ్ర‌ విచార‌ణ సాగించాల‌ని పిటిష‌న్ వేస్తే దానికి కోర్టు కొట్టివేసింది. అయినా దీనిని విడిచిపెట్టేందుకు తాము సిద్ధంగా లేమ‌ని దిల్లీ ఏసీపీ ఆఫీస‌ర్ వేద్ భూష‌ణ్ స్టేట్‌మెంట్ ఇవ్వ‌డం సంచ‌ల‌న‌మైంది. శ్రీ‌దేవి డెత్‌.. ప్రీప్లాన్డ్ మ‌ర్డ‌ర్‌. అక్క‌డ జ‌రిగిన స‌న్నివేశం ప‌లు అనుమానాల‌కు తావిచ్చింద‌ని ఆయ‌న పేర్కొన‌డంపై ప్ర‌స్తుతం స‌ర్వత్రా ఆస‌క్తిక‌ర చ‌ర్చ సాగుతోంది. వేద్ భూష‌ణ్‌కి చెందిన ప్ర‌యివేటు డిటెక్టివ్ ఇన్వెస్టిగేష‌న్ ఏజెన్సీ శ్రీ‌దేవి మ‌ర‌ణంపై సీక్రెట్‌గా ప‌రిశోధ‌న సాగించింది. ఇటీవ‌లే తిరిగి ఇండియాకు తిరిగి వ‌చ్చిన క్ర‌మంలో ఆయ‌న ఈ వ్యాఖ్య‌లు చేయ‌డం ప్రాధాన్య‌త సంత‌రించుకుంది. “బాత్ ట‌బ్‌లో ఊపిరి ఆడ‌కుండా చేసి చంపేయ‌డం అంత క‌ష్ట‌మేమీ కాదు. ఇలాంటి కేసులో ఆధారాలు దొర‌క‌కుండా నిందితులు జాగ్ర‌త్త‌ప‌డేందుకు ఆస్కారం ఉంద‌“ని వేద్ భూష‌ణ్ ఖ‌రాకండిగా చెబుతున్నారు. ఈ మ‌ర్డ‌ర్ మిస్ట‌రీని మాదైన కోణంలో ప‌రిశోధించామ‌ని ఆయ‌న వెల్ల‌డించారు. శ్రీ‌దేవి డెత్ మిస్ట‌రీలో ఏదో దాగి ఉంది అన్న కోణాన్ని ప‌రిశోధిస్తున్నామ‌ని, ఇందులో ఏదో లాజిక్ ఉంద‌ని ఆయ‌న వ్యాఖ్యానించారు. ఇక శ్రీ‌దేవి విదేశాల్లో మ‌ర‌ణిస్తే 500 కోట్ల మేర ఇన్సూరెన్స్ రిక‌వ‌రీ ఉంద‌ని, అందుకే చంపేశార‌న్న వాద‌నను ఇటీవ‌ల ప‌లువురు తెర‌పైకి తెచ్చిన సంగ‌తి తెలిసిందే.

User Comments