శ్రీదేవి, రేఖ‌ల‌కు ఏఎన్నార్ అవార్డులు

Akkineni Awards

అక్కినేని ఇంట‌ర్నేష‌న‌ల్ పౌండేష‌న్ త‌ర‌పున‌ ఏఎన్నార్ జాతీయ అవార్డులు ఇస్తున్న సంగ‌తి తెలిసిందే. ఈ ట్ర‌స్ట్ కు క‌ళాబంధు టీ.సుబ్బ‌రామిరెడ్డి ఛైర్మ‌న్ గా ఉన్నారు. ఇప్ప‌టికే ఎంద‌రికో ఈ పుర‌స్కారాలు ద‌క్కాయి. లేటెస్టుగా 2018-2019 సంవ‌త్స‌రాల‌కు గాను క‌మిటీ అవార్డుల‌ను ప్ర‌క‌టించింది. 2018 ఏడాదికిగాను దివంగ‌త అందాల తార శ్రీదేవికి.. 2019 ఏడాదిగాను బాలీవుడ్ వెట‌ర‌న్ న‌టి రేఖ‌కు అక్కినేని అవార్డును అంజేస్తున్న‌ట్లు ప్ర‌క‌టించారు. ఈ అవార్డుకు సంబంధించిన వివ‌రాల‌ను అక్కినేని నాగార్జున క‌ళా బంధు టీ. సుబ్బ‌రామిరెడ్డి తో క‌లిసి ఏర్పాటు చేసిన మీడియా స‌మావేశంలో వెల్ల‌డించారు.

ఈనెల‌ 17న అన్న‌పూర్ణ స్టూడియోస్ లో ఓ ప్ర‌త్యేక కార్య‌క్ర‌మం నిర్వ‌హించి అవార్డులు ప్ర‌దానం చేస్తామ‌న్నారు. ఈ కార్య‌క్ర‌మానికి మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిధిగా హాజ‌రై ఆయ‌న చేతుల మీదుగా అవార్డులు అంద‌జేయ‌నున్న‌ట్లు నాగార్జున తెలిపారు. అలాగే అదే రోజున అన్న‌పూర్ణ స్టూడియోస్ లో అన్న‌పూర్ణ కాలేజ్ ఆఫ్ ఫిల్మ్ అండ్ మీడియా మూడో కాన్వ‌కేష‌న్ నిర్వ‌హించ‌నున్నారు. ఈ కార్య‌క్ర‌మానికి అమితాబ్ బ‌చ్చ‌న్ -రేఖ- బోనీక‌పూర్ ఫ్యామిలీ స‌భ్యులు ముఖ్య అతిధిగా విచ్చేస్తార‌ని తెలిపారు.