శ్రీ‌దేవి ఎవ‌రు? సావిత్రి ఎవ‌రు?

Last Updated on by

ఎన్టీఆర్ బ‌యోపిక్ గురించిన‌ ఒక్కో ఆస‌క్తిక‌ర సంగ‌తి ప్ర‌పంచ‌వ్యాప్తంగా ఉన్న న‌ట‌సార్వ‌భౌముని అభిమానుల‌కు కిక్కు పెంచుతూనే ఉన్నాయి. ఈ చిత్రంలో నిమ్మ‌కూరులో నూనూగు మీసాల‌ ఎన్టీఆర్ అల్ల‌రిచిల్ల‌ర ప‌నుల్ని అంతే అందంగా క్యూట్‌గా చూపించ‌నున్నార‌న్న సంగ‌తి అభిమానుల్లో క్యూరియాసిటీ పెంచింది. ప‌న‌మ్మాయికి, పాల‌మ్మే అమ్మాయికి లైనేసే ఎన్టీఆర్‌ని చూడాల‌ని అంద‌రిలో కుతూహాలం పెరిగింది.

అదంతా స‌రే.. అస‌లు ఎన్టీఆర్ జీవితంలో ఎంతో ఇంపార్టెంట్ క‌థానాయిక‌లు అయిన శ్రీ‌దేవి, సావిత్రి, జ‌య‌ప్ర‌ద వంటి వారికి ఆల్ట‌ర్నేట్ నాయిక‌లెవ‌రు? న‌వ‌త‌రం నాయిక‌ల్లో ఎవ‌రు న‌టిస్తున్నారు? అన్న ప్ర‌శ్న‌కు ఇంత‌కాలం స‌మాధానం లేనేలేదు. ఇదిగో తాజా స‌మాచారం ప్ర‌కారం… ఎన్టీఆర్ బయోపిక్‌లో శ్రీ‌దేవిగా ర‌కుల్‌, సావిత్రిగా కీర్తి సురేష్ న‌టిస్తార‌ని తెలుస్తోంది. అయితే ఇవ‌న్నీ ఇలా వ‌చ్చి అలా వెళ్లే చిన్న పాత్ర‌లే. ఎన్టీఆర్ సినిమాల్లో న‌టించేప్పుడు ఆయ‌న‌తో చెట్టు, పుట్టా వెంట సాంగేసుకోవ‌డాలు, లేదా ఎమోష‌న‌ల్ సీన్స్‌లో న‌టించాక తెర‌వెన‌క సంగ‌తులు చూపిస్తార‌న్న‌మాట‌. అయితే ఈ చిత్రంలో నూనూగు మీసాల ఎన్టీఆర్‌గా మోక్ష‌జ్ఞ న‌టిస్తార‌ని చెబుతుంటే, అత‌డు లైనేసే పాల‌మ్మాయిగా ర‌కుల్ న‌టించ‌నుంద‌ని ప్ర‌చార‌మైంది. ర‌కుల్ డెబ్యూ హీరో మోక్ష‌జ్ఞకు పెయిర్ అంటూ ప్ర‌చారం సాగింది. అయితే అది నిజం కాదని తెలుస్తోంది. మొత్తానికి శ్రీ‌దేవి ఎవ‌రు? సావిత్రి ఎవ‌రో తేలింది. ఇక జ‌య‌ప్ర‌దగా ఎవ‌రిని ఎంపిక చేస్తారో, ఆ పాత్ర ఉందో లేదో తెలియాల్సి ఉంది.

User Comments