టాలీవుడ్ కి శ్రీహ‌రి త‌న‌యుడు

దివంగ‌త న‌టుడు శ్రీహ‌రి, డిస్కోశాంతి దంప‌తుల పెద్ద కుమారుడు మేఘామ్ష్‌ టాలీవుడ్ ఎంట్రీ ఖ‌రారైంది. `రాజ్ దూత్` అనే సినిమాతో ప‌రిచ‌యం కాబోతున్నాడు. ఈ చిత్రంతో కార్తిక్‌, అర్జున్‌ దర్శకులుగా పరిచయం అవుతున్నారు. ప్రస్తుతం సినిమా సెట్స్ లో ఉన్న‌ట్లు తెలుస్తోంది. అయితే ఈ సినిమా ఎప్పుడు ప్రారంభ‌మైంది? ఎప్పుడు సెట్స్ కు వెళ్లింది వంటి విష‌యాలు ఇప్ప‌టివ‌ర‌కూ ఎక్క‌డా బ‌య‌ట‌కు రాలేదు. తాజా లీక్ తో మేఘామ్ష్ అంతటా హాట్ టాపిక్ అయ్యాడు. లక్ష్య ప్రొడక్షన్స్‌ బ్యానర్‌పై ఎంఎల్‌వీ సత్యానారాయణ నిర్మిస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

శ్రీహ‌రి మ‌ర‌ణం త‌ర్వాత ఉనికిని కోల్పోయిన ఆ ఫ్యామిలీ మ‌ళ్లీ సినిమాల్లోకి వ‌స్తుందా? రాదా? అన్న దానిపై అప్ప‌టో డిస్కో శాంతి స‌రైన స‌మాధానం ఇవ్వ‌లేక‌పోయారు. పిల్లలు ఇష్టాల‌ను బ‌ట్టి ఉంటుందని త‌న ప్రమేయం ఏదీ ఉండ‌ద‌ని అనాస‌క్తిగా స్పందించారు. కానీ ఇప్పుడిలా చ‌డిచ‌ప్పుడు లేకుండా ట్విస్ట్ ఇస్తార‌ని ఊహించ‌లేక‌పోయారు. స్టంట్‌ ఫైటర్‌గా చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టి శ్రీహరి ఎన్నో చిత్రాల్లో నటించి ‘రియల్‌ స్టార్’గా గుర్తింపు తెచ్చుకున్న సంగ‌తి తెలిసిందే.