అడ్డాల జీత‌భ‌త్యం షాకిస్తోందే

విక్ట‌రీ వెంక‌టేష్ హీరోగా శ్రీకాంత్ అడ్డాల ద‌ర్శ‌క‌త్వంలో త‌మిళ సినిమా అసుర‌న్ ని రీమేక్ చేస్తోన్న సంగ‌తి తెలిసిందే. సురేష్ ప్రొడ‌క్ష‌న్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. ఇప్ప‌టికే ప్రీ ప్రొడ‌క్ష‌న్ ప‌నులు మొద‌ల‌య్యాయి. ప్ర‌స్తుతం వెంక‌టేష్, శ్రీకాంత్, ఇంకా కొంత మంది రైట‌ర్ల బృందం క‌థ‌లో మార్పుల‌పై క‌స‌ర‌త్తులు చేస్తున్నారు. వీలైనంత త్వ‌ర‌గా ప్రీ  ప్రొడ‌క్ష‌న్ పూర్తిచేసి సెట్స్ కు వెళ్లాల‌ని స‌న్నాహాలు చేస్తున్నారు. ఈ నేప‌థ్యంలో శ్రీకాంత్ అడ్డాల పారితోషికం గురించి ఓ ఆసక్తిక‌ర విష‌యం వెలుగులోకి వ‌చ్చింది. ఈ సినిమాకు శ్రీకాంత్ రెమ్యున‌రేషన్ ఒకేసారి కాకుండా నెలవారీ జీతం తీసుకుంటున్న‌ట్లు తెలుస్తోంది.

నెల‌కు రెండు ల‌క్ష‌లు చొప్పున ఇస్తాన‌ని సురేష్ బాబు ఒప్పందం చేసుకున్నాడుట‌. అంటే స్క్రిప్ట్ ప‌నులు ప్రారంభ‌మైన ద‌గ్గ‌ర నుంచి సినిమా షూటింగ్  పూర్తి చేసి లీజ్ చేసే వ‌ర‌కూ నెల‌కు రెండు ల‌క్ష‌లు  చొప్పున జీతం రూపంలో ఇవ్వాల్సింద‌ని తెలుస్తోంది. అంటే ఎలా చూసినా శ్రీకాంత్ రెమ్యెన‌రేష‌న్ చాలా త‌క్కువ‌నే తెలుస్తోంది.  స‌క్సెస్ లో ఉన్నంత కాలం భారీ పారితోషికం అందుకున్న శ్రీకాంత్ ఇలా ఇప్పుడు నెల జీతానికి సినిమా డైరెక్ట్ చేయ‌డం అనేది వింత‌గానే ఉంది. చిన్న చిన్ని కంపెనీలు ద‌ర్శ‌కుల‌కు ఈ లెక్క‌న పే చేస్తాయి. అదీ చాలా రేర్ కంపెనీలు ఉంటాయి. చాలా వ‌ర‌కూ ఓ ప్యాకేజ్ మాట్లాడుకుని దాని ప్ర‌కారం ముందుకెళ్తారు. కానీ ఇది డిఫ‌రెంట్ స్కీమ్. స‌క్సెస్ ఉంటేనే ఏదైనా ఇక్క‌డ‌. అలాగే స‌క్సెస్ కోస‌మే సురేష్ బాబు మాస్ట‌ర్ మైండ్  ముందు త‌లొంచాడ‌ని అర్థ‌మ‌వుతోంది. హిట్టు సాధిస్తే గ‌నుక అప్పుడేమైనా సురేష్‌ బాబు వాటాలో ప‌ర్సంటేజ్ ఇచ్చే అవ‌కాశం ఉందని ఓ గెస్ వినిపిస్తోంది. ఈ సినిమా బ‌డ్జెట్ 13 కోట్లుగా కేటాయించారుట‌.