రాజుగారికి చివ‌రికి మిగిలేది!

Last Updated on by

ఈ వారం రిలీజైన రెండు సినిమాల బాక్సాఫీస్‌ రిపోర్ట్ ఏంటి? అంటే .. ఈ రెండిటిలో ఒక‌టి బ్లాక్‌బ‌స్ట‌ర్ అయితే, వేరొక‌టి డిజాస్ట‌ర్ టాక్‌తో ట్రేడ్ లో ఆస‌క్తిక‌ర చ‌ర్చ సాగుతోంది. నితిన్ హీరోగా, స‌తీష్ వేగేష్న ద‌ర్శ‌క‌త్వంలో దిల్‌రాజు నిర్మించిన `శ్రీ‌నివాస క‌ళ్యాణం` బాక్సాఫీస్ వ‌ద్ద డిజాస్ట‌ర్ టాక్ తెచ్చుకుంది. ఈ సినిమా మినిమం రూ.30 కోట్లు అయినా వ‌సూలు చేస్తుంద‌ని భావిస్తే, అందులో స‌గం వ‌సూళ్లు అయినా ద‌క్క‌డం క‌ష్ట‌మ‌న్న మాట వినిపిస్తోంది. ఈ సినిమా పంపిణీదారుల‌కు తీవ్ర న‌ష్టాలు త‌ప్ప‌వ‌ని చెబుతున్నారు.

పైగా దేవ‌ర‌కొండ‌- గీతా ఆర్ట్స్ సినిమా `గీత గోవిందం` తొలి రోజు బ్లాక్‌బ‌స్ట‌ర్ హిట్ అన్న‌ టాక్ తెచ్చుకోవ‌డంతో ఆ ప్ర‌భావం `శ్రీ‌నివాస క‌ళ్యాణం` వ‌సూళ్ల‌పై తీవ్రంగా ప‌డింద‌ని ట్రేడ్‌లో చెబుతున్నారు. ఒక‌రికి ఆనందం.. వేరొక‌రికి దుఃఖం త‌ప్ప‌లేద‌న్న మాటా వినిపిస్తోంది. ఇక ఈ రెండు సినిమాల‌కు ముందే వ‌చ్చిన `గూఢ‌చారి` బ్లాక్‌బ‌స్ట‌ర్ టాక్‌తో అద్భుత‌మైన వ‌సూళ్లు సాధించింది. ఇప్ప‌టికీ గూఢ‌చారి హ‌వా చాలాచోట్ల క‌నిపిస్తోంద‌న్న టాక్ ఉంది. మొత్తానికి శ్రీ‌నివాస క‌ళ్యాణం ఫ‌లితం దిల్‌రాజును తీవ్రంగానే నిరాశ‌ప‌రిచింద‌న్న మాట ఫిలింస‌ర్కిల్స్‌లో హాట్ టాపిక్ అయ్యింది. మ‌రోవైపు గీత గోవిందం రిలీజైన రెండు రోజుల‌కే 25కోట్లు వ‌సూలు చేసి 40 కోట్ల క్ల‌బ్‌లో చేరిపోనుంద‌న్న ప్ర‌చారం సాగుతున్న సంగ‌తి తెలిసిందే.

User Comments