దిల్ రాజు సినిమాకు నో బ‌య్య‌ర్స్

Last Updated on by

అదేంటి.. దిల్ రాజు సినిమా అంటే హాట్ కేక్ క‌దా..! ఆయ‌న సినిమా ఎప్పుడు కావాల‌న్నా కొనేవాళ్లు ఉంటారు. పైగా ఎప్పుడూ త‌న‌ను న‌మ్మిన వాళ్ల‌కే ఈ నిర్మాత ఇస్తుంటాడు క‌దా.. ఇంకా బ‌య్య‌ర్ల స‌మ‌స్య ఏంటి అనుకుంటున్నారా..? ఇక్క‌డే చిన్న ట్విస్ట్ ఉంది. ఈ సినిమాకు బ‌య్యర్లు లేరు అంటుందిక్క‌డ కాదు.. ఓవ‌ర్సీస్ లో. గ‌తేడాది దిల్ రాజు సినిమాల‌న్నీ యుఎస్ లో కూడా స‌త్తా చూపించాయి. కానీ ఇప్పుడు చిన్న హీరోతో సినిమా చేయ‌డంతో ల‌వ‌ర్ గురించి ఎవ‌రూ పెద్ద‌గా ప‌ట్టించుకోవ‌డం లేదు.

ల‌వ‌ర్ జులై 20న విడుద‌ల కానుంది. ఇప్ప‌టికీ ఓవ‌ర్సీస్ లో అమ్మ‌లేదు. ఇక దాంతోపాటు ఆశ్చ‌ర్యక‌రంగా శ్రీ‌నివాస క‌ళ్యాణం.. హ‌లో గురు ప్రేమ‌కోస‌మే లాంటి సినిమాల‌కు కూడా ఓవ‌ర్సీస్ లో అనుకున్న రేట్ కు బ‌య్య‌ర్లు రావ‌డం లేదు. త్రినాథ‌రావ్ న‌క్కిన అంటే మ‌రీ రొటీన్ క‌థ‌లు చేస్తాడ‌నే విమ‌ర్శ ఉంది.. ఇక శ్రీ‌నివాస క‌ళ్యాణం అంటే నితిన్ ఫామ్ లో లేడు.. రాజ్ త‌రుణ్ ల‌వ‌ర్ గురించి చెప్పాల్సిన ప‌నిలేదు. దాంతో దిల్ రాజుకు ఇప్పుడు ఈ బ‌య్య‌ర్ల క‌ష్టాలు త‌ప్పేలా లేవు.

User Comments