`మా`కు శ్రీ‌రెడ్డి కోటింగ్‌

Last Updated on by

మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేష‌న్(మా) ప‌రువు మ‌ర్యాద‌ల్ని గంగ‌లో క‌లిపేసింది శ్రీ‌రెడ్డి. ఈ వివాదాస్ప‌ద న‌టి దెబ్బ‌కు మా పెద్ద‌లు ఝ‌డుసుకు చ‌చ్చారంటే న‌మ్మండి! ఆర్టిస్టుల సంఘంలో త‌న‌కు స‌భ్య‌త్వం ఇవ్వ‌క‌పోతే .. మెంబ‌ర్‌షిప్ కార్డ్ ఇవ్వ‌క‌పోతే నా త‌డాఖా ఏంటో చూపిస్తానంటూ శ్రీ‌రెడ్డి ఏకంగా ఫిలింఛాంబ‌ర్ ఎదుట బ‌ట్ట‌లు విప్పింది. ఆ ఘ‌ట‌న అనంత‌రం శ్రీ‌రెడ్డి వ్య‌వ‌హారానికి ఝ‌డుసుకుపోయిన ఆర్టిస్టుల సంఘం పెద్ద‌లు త‌న‌కు మెంబ‌ర్‌షిప్ ఇస్తున్నామంటూ ప్ర‌క‌టించారు. అయితే ఇప్ప‌టికీ స‌భ్య‌త్వానికి సంబంధించిన కార్డ్ త‌న‌కు అంద‌లేద‌ని, ఈ విష‌యంలో కాకమ్మ క‌థ‌లు చెబుతున్నార‌ని మ‌రోసారి ఆరోపించింది.

ఈసారి ఫేస్‌బుక్ వేదికగా శ్రీ‌రెడ్డి ప్ర‌కంప‌నాలు మ‌రోసారి వాడి వేడి చ‌ర్చ‌కు తావిస్తున్నాయి. శ్రీ‌రెడ్డి తాజాగా ఫేస్‌బుక్‌లో మాపై కౌంట‌ర్ స్టార్ట్ చేసింది. “తీగ లాగాను. డొంక క‌దిలింది. మ‌నోళ్లు చిన్న స‌మ‌స్య అని లైట్ తీస్కున్నా.. అమెరిక‌న్ పోలీస్ సీరియ‌స్‌గా తీసుకున్నారు. అమెరికా బ‌రిలో దిగింది. గొడ‌వ ముద‌ర‌క ముందే త‌ల‌సాని వారు, మా అసోసియేషన్ వారు క‌లిసి మా స‌మ‌స్య‌ల‌ను చ‌క్క‌దిద్దుతారో లేక నాకు కార్డ్ ఇవ్వ‌కుండా కాక‌మ్మ క‌థలు చెప్పిన‌ట్టు అమెరిక‌న్ పోలీసుల‌కి చెబుతారో చూద్దాం. అమెరికాలో ఉన్న మ‌న ఎన్నారైలంతా మా అసోసియేష‌న్ వ‌ల్ల‌ చిక్కుల్లో ప‌డేట్టు ఉన్నారు. కార్డ్ ఏదో మా మొహాన ప‌డేయొచ్చుగా..!“ అంటూ శ్రీ‌రెడ్డి ఎఫ్‌బిలో ఫైరైంది. నిప్పు రాజేస్తాను చూడు! అంటూ త‌న‌దైన శైలిలో జైహింద్ చెప్పింది ఈ భామ‌. మొత్తానికి మా అసోసియేష‌న్ ప‌రువు మ‌ర్యాద‌ల్ని అమెరికాలోనూ తీసేందుకు శ్రీ‌రెడ్డి కంక‌ణం క‌ట్టుకుంద‌ని ఈ ఉదంతం తెలియ‌జేస్తోంది. ఇక‌పోతే సెక్స్ రాకెట్‌లో దొరికిపోయిన కిష‌న్‌- చంద్ర‌క‌ళ దంప‌తులు మా అసోసియేష‌న్ ఇన్వాల్వ్‌మెంట్‌ను అమెరికా పోలీసుల ముందు లీక్ చేస్తార‌నే అర్థం వ‌చ్చేలా శ్రీ‌రెడ్డి చేసిన కామెంట్ చూస్తుంటే ఇందులో ఇంకా ఎన్నో నిజాలున్నాయా? అన్న సందేహం క‌ల‌గ‌క‌మాన‌దు. మ‌రో ర‌కంగా మా అసోసియేష‌న్‌ని స‌భ్య‌త్వం కోసం శ్రీ‌రెడ్డి బ్లాక్‌మెయిల్ చేస్తోంద‌న్న సంగ‌తి ఈ మెసేజ్‌లో బ‌ట్ట‌బ‌య‌లైంది.

User Comments