ద్యావుడ‌! శ్రీ‌రెడ్డి బ‌యోపిక్‌!!

Last Updated on by

టాలీవుడ్‌లో వ‌రుస‌గా బ‌యోపిక్‌లు తీస్తున్నారు. ఎన్టీఆర్‌, వైయ‌స్సార్‌, దాస‌రి వంటి లెజెండ్స్‌పై సినిమాలు తీస్తున్నారు. అయితే వీళ్ల జీవితాల్లో లేనంత మ‌సాలా వేరొకరి జీవితంలో ఉంది. అది డ‌ర్టీపిక్చ‌ర్‌ని మించి. ఇంత‌కీ ఎవ‌రావిడ‌? అంటారా? .. ది గ్రేట్ శ్రీ‌రెడ్డి. 100ఏళ్ల భార‌తీయ సినిమా చ‌రిత్ర‌లో.. 85ఏళ్ల తెలుగు సినిమా హిస్ట‌రీలో ఎన్న‌డూ లేని విధంగా తెలుగు వారి ప‌రువు మ‌ర్యాద‌ల్ని అంత‌ర్జాతీయ వేదిక‌పైకి నిస్సిగ్గుగా మంట‌గ‌లిపే ప్ర‌య‌త్నం చేసిన శ్రీ‌రెడ్డి జీవితంపై బ‌యోపిక్ ఎందుకు తీయ‌రు? సిగ్గులేని వాళ్లు ఇంత‌కీ ఎవ‌రు? మ‌న తెలుగు ద‌ర్శ‌క‌నిర్మాత‌లా? లేక అస‌లు ఏ ఇండ‌స్ట్రీలోనూ ఎవ‌రూ పుట్ట‌లేదా? ద‌గుల్భాజీ ధ‌గాకోరు దందాలు చేసే ఎంద‌రో మ‌హానుభావులున్న ప‌విత్ర భార‌త‌దేశంలో అస‌లు శ్రీ‌రెడ్డి బ‌యోపిక్ తీసేవాళ్లే లేరా? ఛ‌్ఛ‌ఛ్ఛ‌ఛ్ఛ అని తిట్టిపోయాల‌నుందా?

అయితే అలాంటివాళ్లంద‌రికీ శ్రీ‌రెడ్డి ఇచ్చిన కోటింగ్ మామూలుగా లేదండోయ్‌! ఈవిడ డైరెక్టుగా మొన్న బ‌ర్త్‌డే రోజు ఏమ‌ని కోరారో తెలుసా? అస‌లు త‌న‌లో ఉన్న ఫెమినిస్టుని ఎవ‌డైనా బ‌య‌టికి తెచ్చేవాడు కావాల్రా బాబూ అని అడిగేసింది. అంతేనా.. క‌ర్త‌వ్యం విజ‌య‌శాంతి లాగా ఫైటింగులు చేసే సినిమా చేస్తుందిట‌. నా క్యారెక్ట‌ర్ ఎలివేట్ చేయండ్రా బాబూ! అని వేడుకుంది. అన్న‌ట్టు శ్రీ‌రెడ్డి ఈ మాట అడిగి ఇప్ప‌టికే కొంత కాల‌మైంది కాబ‌ట్టి ఇంత‌కీ ఎవ‌రైనా తెలుగు ద‌ర్శ‌క‌ర‌చ‌యిత‌లు క‌థ‌లు ఏవైనా రాసారో ఏమో! అస‌లే బ‌యోపిక్‌ల ట్రెండ్ న‌డుస్తోంది. శ్రీ‌రెడ్డి బ‌యోపిక్ తీస్తే కొంప‌దీసి సిల్కుస్మిత బ‌యోపిక్‌లాగా హిట్ట‌యిపోద్దేమో? డర్టీపిక్చ‌ర్ 2 రేంజులో ఇండ‌స్ట్రీని కుదిపేస్తుందేమో? అంటూ మాట్లాడుకుంటున్నారు. వ్వారి ద్యావుడ‌!! అస‌లు శ్రీ‌రెడ్డిని ఎందుకు పుట్టించావ్ దేవుడా!!

User Comments