శ్రీ‌లీక్స్‌: హీరో భార్య అమ్మాయిల స‌ప్లై?

Last Updated on by

మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేష‌న్ (మా) ఎన్నిక‌లు మార్చి 10న జ‌రుగుతున్న సంగ‌తి తెలిసిందే. శివాజీ రాజా.. సీనియ‌ర్ న‌రేష్ మ‌ధ్య అధ్య‌క్ష ప‌ద‌వి కోసం హోరాహోరీ కొన‌సాగుతోంది. ఒక‌రిపై ఒక‌రు ఘాటైన కామెంట్ల‌తో విరుచుకుప‌డుతున్నారు. న‌రేష్ స‌రిగా సాయప‌డ‌లేద‌ని శివాజీ రాజా విమ‌ర్శిస్తే, శివాజీ రాజా స‌రిగా ప‌ని చేయ‌లేద‌ని న‌రేష్ విమ‌ర్శిస్తున్నారు. ఇరు ప్యానెళ్లు ఆర్టిస్టుల్లో ప్ర‌చారంలో దూసుకుపోతున్నారు. అయితే అత‌డు ఆయ‌న‌ మ‌ధ్య‌లో ఆమె! అన్న చందంగా ఇప్పుడు శ్రీరెడ్డి బ‌రిలో దిగ‌డం శ్రీ‌లీక్స్ ఎపిసోడ్స్ ని కొన‌సాగించ‌డం ప్ర‌ముఖంగా చ‌ర్చ‌కు వ‌చ్చింది.

తాజాగా శ్రీ‌రెడ్డి చేసిన ఓ వ్యాఖ్య అంత‌ర్జాలాన్ని వేడెక్కిస్తోంది. “ఆ హీరో భార్య అమ్మాయిలను సప్లై చేస్తుంది, కేకలు వేస్తున్నా వదలడు..“ అంటూ ఘాటైన వ్యాఖ్య‌లు చేయ‌డం సంచ‌ల‌న‌మైంది. మొన్న‌టి వ‌ర‌కూ శివాజీ రాజా బృందంపై వ్య‌తిరేకంగా కామెంట్లు చేసిన శ్రీ‌రెడ్డి ఇప్పుడు ఆపోజిట్ ప్యానెల్ వెన్ను విరిచే కామెంట్లు చేయ‌డంపై స‌ర్వ‌త్రా ఆస‌క్తిక‌రంగా ముచ్చ‌టించుకుంటున్నారు. శివాజీ రాజా ప్యానెల్ కే ఓటేయాల‌ని ఆర్టిస్టుల్ని శ్రీ‌రెడ్డి అడుగుతోంది. అర్హ‌త లేని ప్యానెల్ న‌రేష్ ప్యానెల్. అందులో వ్య‌క్తులు స‌రైన వాళ్లు కాదు! అంటూ శ్రీ‌రెడ్డి తీవ్రంగా విమ‌ర్శించింది. శివాజీ రాజాతో విభేధాలు ఉన్న మాట నిజ‌మే. కానీ చెడ్డ వాళ్ల‌కు మా అసోసియేష‌న్ క‌ట్ట‌బెడుతుంటే చూడ‌లేకపోతున్నానంటూ శ్రీ‌రెడ్డి వ్యాఖ్యానించ‌డం విశేషం. అన్న‌ట్టు ఆ హీరో భార్య అంటూ శ్రీ‌లీక్స్ వ్య‌వ‌హారం ఎవ‌రిని వేలెత్తి చూపిస్తోంది?

User Comments