ప‌వ‌న్, త్రివిక్ర‌మ్‌కి ఆ పిచ్చి? శ్రీ‌రెడ్డి వెన‌క షాడో!!

Last Updated on by

ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ల్యాణ్‌, త్రివిక్ర‌మ్ ల‌కు అమ్మాయిల పిచ్చి ఉంద‌ని, ఆ ఇద్ద‌రూ ప‌లువురు మ‌గువల జీవితాల్ని నాశ‌నం చేశార‌ని న‌టి శ్రీ‌రెడ్డి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేసింది. పూన‌మ్ కౌర్ జీవితంతో ప‌వ‌న్ క‌ల్యాణ్, పార్వ‌తి మెల్ట‌న్ జీవితంతో త్రివిక్ర‌మ్ ఆడుకున్నార‌ని .. ఆ ఇద్ద‌రికీ ఎన్నో ఆశ‌లు క‌ల్పించి ముఖం చాటేశార‌ని శ్రీ‌రెడ్డి త‌న యూట్యూబ్ చానెల్లో సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేయ‌డం చ‌ర్చ‌కు వ‌చ్చింది.

ప్ర‌స్తుతం శ్రీ‌రెడ్డి వ్యాఖ్య‌ల‌పై .. ప‌వ‌న్, త్రివిక్ర‌మ్ అభిమానులు గ‌రంగ‌రంగా ఉన్నార‌ని తెలుస్తోంది. ఆస‌క్తిక‌రంగా శ్రీ‌రెడ్డి తన యూట్యూబ్ చానెల్ ఇంట‌ర్వ్యూలో ప‌లు సాక్ష్యాధారాల్ని చూపించే ప్ర‌య‌త్నం చేసింది. ఇందులో పూన‌మ్ కౌర్ మాట్లాడిన ఆడియో టేప్ అంటూ శ్రీ‌రెడ్డి కొన్ని ఆస‌క్తిక‌ర విష‌యాల్ని రివీల్ చేసింది. ప‌వ‌న్ అంటే పిచ్చి .. త‌న‌ని పెళ్లాడ‌క‌పోయినా.. త‌న‌తో బంధం పంచుకోవాల‌నుకున్నా! అంటూ ఆ ఆడియో టేప్ రివీల్ చేసింది. అలాగే ప‌వ‌న్ క‌ల్యాణ్ కి స్టార్ హోట‌ల్ వ‌దిలి బ‌య‌టకు వ‌చ్చేంత ధైర్యం లేద‌ని శ్రీ‌రెడ్డి వ్యాఖ్యానించింది. ఇక త్రివిక్ర‌మ్ పై ఆరోపిస్తూ .. అత‌డు పార్వ‌తి మెల్ట‌న్ కి అవ‌కాశాలు రాకుండా అడ్డు ప‌డ్డాడ‌ని, త‌నంటే పార్వ‌తికి పిచ్చి ప్రేమ అన్న సంగ‌తిని వెల్ల‌డించింది. పార్వ‌తి మెల్ట‌న్ జీవితాన్ని త్రివిక్ర‌మ్ కాల‌రాశాడ‌ని ఘాటైన ప‌ద‌జాలం శ్రీ‌రెడ్డి ఉప‌యోగించింది. ప్ర‌స్తుతం ఈ అమ్మ‌డి వ్యాఖ్య‌లు అభిమానుల్లో క‌ల‌క‌లం రేపుతున్నాయి. ఆస‌క్తిక‌రంగా జన‌సేన అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్ కి ఉన్న అమ్మాయిల పిచ్చి దృష్ట్యా త‌న‌కు ఓటు వేయొద్ద‌ని శ్రీ‌రెడ్డి వ్యాఖ్యానించ‌డం చూస్తుంటే ఈ ఇంట‌ర్వ్యూ వెన‌క రాజ‌కీయంగా ప్రాధాన్య‌త ఉంద‌ని అర్థ‌మ‌వుతోంది. ఏపీలో ఎన్నిక‌ల వేడి రాజుకుంటున్న సంద‌ర్భంగా శ్రీ‌రెడ్డి సంచ‌ల‌న వ్యాఖ్య‌ల వెన‌క ఉన్న‌ది ఎవ‌రు? అంటూ ఆస‌క్తిగా మాట్లాడుకుంటున్నారు.