తంబీల తాట తీస్తోంది

Last Updated on by

శ్రీ‌లీక్స్ వ్య‌వ‌హారం ఎప్ప‌టికి ముగుస్తుంది? ఎండ్ కార్డ్ లేని టీవీ సిరీస్‌లా అలా సాగిపోతూనే ఉంది. అయితే ఇన్నాళ్లు టాలీవుడ్‌ని మాత్ర‌మే టార్గెట్ చేసిన శ్రీ‌రెడ్డి, ఇప్పుడు కోలీవుడ్‌ని ఒణికిస్తోంది. అక్క‌డా ఆర్టిస్టులు, ద‌ర్శ‌కులు లేదా టెక్నీషియ‌న్ల పేర్లు బ‌య‌ట‌పెడుతూ ఆటాడుకుంటోంది. మురుగ‌దాస్ వంటి పెద్ద ద‌ర్శ‌కుడి పేరునే శ్రీ‌రెడ్డి బ‌య‌ట‌పెట్టడం సంచ‌ల‌న‌మైంది.

అయితే శ్రీ‌రెడ్డి యాక్ట్‌ని ఓ ఇద్ద‌రు మాత్రం తీవ్రంగా వ్య‌తిరేకిస్తున్నారు. న‌డిగ‌ర‌సంఘం ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి, హీరో విశాల్‌, కీల‌క కార్య‌వ‌ర్గ‌ స‌భ్యుడు కార్తీ ఇద్ద‌రూ శ్రీ‌రెడ్డిని అట‌కాయిస్తున్నారు. ఏదైనా ప్రూఫ్ వుంటే పోలీసుల వ‌ద్ద నిరూపించుకో! ఫిర్యాదు చేసుకో!! అని కార్తీ చీవాట్లు పెట్టే ప్ర‌య‌త్నం చేశాడు. అయితే ఇది త‌న‌ని తీవ్రంగా హ‌ర్ట్ చేసేసింద‌ని శ్రీ‌రెడ్డి ప్ర‌తి ఎటాక్ చేసింది. మొత్తానికి శ్రీ రెడ్డి ఎపిసోడ్స్ త‌మిళ తంబీల్ని వేడెక్కిస్తున్నాయ్‌. శ్రీ‌లీక్స్ వ్య‌వ‌హారం మ‌రోసారి ప‌రాకాష్ట‌కు చేరేట్టే క‌నిపిస్తోంది. కార్తీ, విశాల్‌పై శ్రీ‌రెడ్డి పిడుగులు ప‌డుతున్నాయ్‌. మ‌రి దీనికి ఎండ్ కార్డ్ ఎప్పుడో? ఇంత‌కీ కోలీవుడ్ నుంచి శ్రీ‌రెడ్డి ఏం ఆశిస్తున్న‌ట్టు? ఇక ఎలానూ టాలీవుడ్‌లో ఛాన్సులివ్వ‌డం లేదు కాబ‌ట్టి కోలీవుడ్‌లో అయినా ఇస్తార‌నా?

User Comments