శృతిహాస‌న్ బ్రేకప్ సీక్రెట్ లీక్

శృతిహాస‌న్ మ‌ల్టీ టాలెంటెడ్ అన్న సంగ‌తి తెలిసిందే. సినిమాలు లేక‌పోయినా మ్యూజిక్ షోల‌తో య‌మ‌బిజీగా గ‌డిపేస్తోంది. గ‌త కొంత కాలంగా మీడియా కార్య‌క్ర‌మాల‌కు దూరంగా వుంటున్న శృతి తాజాగా త‌న బ్రేక‌ప్ సీక్రెట్‌ని బ‌య‌ట‌పెట్టేసింది. మంచి ల‌క్ష్మి `ఫీట‌ప్ విత్ స్టార్స్` పేరుతో తార‌ల సీక్రెట్స్ ని బ‌య‌ట‌పెడుతూ ఓ వినూత్న‌మైన షోని ర‌న్ చేస్తున్న విష‌యం తెలిసిందే. ఇటీవ‌ల ఈ షోలో పాల్గొన్నశృతీహాస‌న్ త‌న ల‌వ్ స్టోరీ బ్రేక‌ప్ వెన‌కున్న అస‌లు సీక్రెట్‌ని బ‌య‌ట‌పెట్టేసింది. గ‌త కొంత కాలంగా బ్రిటీష్ స్టేజ్‌ ఆర్టిస్ట్ మైఖేల్ కోర్స‌ల్‌తో శృతి ప్రేమాయ‌ణం సాగించింది.
అయితే ఇద్ద‌రి మ‌ధ్య ఏం జ‌రిగిందో ఏమో తెలియ‌దు కానీ అర్థాంత‌రంగా వీరి ల‌వ్ స్టోరీకి బ్రేక్ ప‌డింది. ఇద్ద‌రం విడిపోయాం అని ఇన్‌స్టా ద్వారా శృతి క్లారిటీ ఇచ్చింది. అయితే ఎందుకు విడిపోతున్నారో మాత్రం ఎక్క‌డా బ‌య‌ట‌పెట్ట‌లేదు. దీంతో అంద‌రిలో అనుమానాలు మొద‌ల‌య్యాయి. తాజాగా అన్ని అనుమానాల‌కు చెక్ పెడుతూ అస‌లు విష‌యాన్ని బ‌య‌ట‌పెట్టేసింది. `నేనూ చాలా కూల్‌. ఇన్నోసెంట్. వెరీ ఎమోష‌న‌ల్‌. అది ఇత‌రుల‌కు కూడా న‌చ్చాలి క‌దా. మంచి వాళ్లు మంచి స‌మ‌యంలో క‌లుస్తారు. చెడ్డ‌వాళ్లు చెడు స‌మ‌యంలో క‌లుస్తారు. నాకు జ‌రిగిన‌దానికి నేను బాధ‌ప‌డ‌టం లేదు. ఇదొక అనుభ‌వంగా తీసుకున్నాను. ప్రేమ వ‌ల్ల ఎంతో నేర్చుకున్నాను. న‌న్ను న‌న్నుగా ప్రేమించే వారి కోసం ఎదురుచూస్తున్నాను“ అని అసలు సంగ‌తి బ‌య‌ట‌పెట్టేసింది.  అంటే మైఖేల్ కోర్స‌లేని చెడ్డ‌వాడు .. న‌న్నుగా ప్రేమించ‌లేద‌న్న సంగ‌తిని శ్రుతి అంగీక‌రించిన‌ట్టే.
శృతీహాస‌న్ ప్ర‌స్తుతం విజ‌య్ సేతుప‌తి హీరోగా న‌టిస్తూ నిర్మిస్తున్న `లాభం` చిత్రంలో న‌టిస్తోంది. ఆమె చేతిలో ఈ సినిమా త‌ప్ప మ‌రో సినిమా లేదు. తెలుగులో కూడా ట్రై చేస్తోంది కానీ ఇంకా ఏ హీరో, ద‌ర్శ‌కుడు గ్రీన్‌సిగ్న‌ల్ ఇవ్వ‌లేదు.