మెగాస్టార్ 152 లో శృతి హాస‌న్!

Last Updated on by

మెగాస్టార్ చిరంజివి క‌థానాయ‌కుడిగా 152వ సినిమా కొర‌టాల శివ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్క‌నున్న సంగ‌తి తెలిసిందే. స్ర్కిప్ట్ ప‌నులు పూర్తిచేసిన కొర‌టాల క్యాస్టింగ్ ప‌నుల్లో బిజీగా ఉన్నాడు. ఇప్ప‌టికే మెగాస్టార్ కు జోడిగా ఏ హీరోయిన్ ని ఎంపిక చేస్తే బాగుంటుంద‌న్న అంశంపై త‌ర్జ‌న బ‌ర్జ‌న పడుతున్నాడు. న‌య‌న‌తార‌, అనుష్క‌, రాశీఖ‌న్నా ఇలా ప‌లువురి భామ‌లు పేర్లు వినిపించినా ఆఛాన్స్ ఎవ‌రిదన్న‌ది ! ఇంకా ఖ‌రారు కాలేదు. ఈ నేపథ్యంలో కొణిదెల కాంపౌండ్ వ‌ర్గాల నుంచి మరో ఇంట్రెస్టింగ్ అప్ డేట్ లీకైంది. ఇందులో ఓ ముఖ్య‌మైన పాత్రలో క‌మ‌ల్ హాస‌న్ గారాల ప‌ట్టి శృతి హాస‌న్ ను ఎంపిక చేసిన‌ట్లు స‌మాచారం. హీరోయిన్ గా దూసుకుపోతున్న శృతి ఈ ఆఫ‌ర్ ను ఎలా యాక్స‌ప్ట్ చేసిందా? అంటే మెగాస్టార్ సినిమా కావ‌డంతోనే న‌టించ‌డానికి ఒప్పుకుంద‌ని అంటున్నారు.

పైగా ఇందులో శ్రుతి పాత్ర చాలా కీల‌కంగాను ఉంటుంద‌ని వినిపిస్తోంది. మ‌రి ఇందులో వాస్త‌వం ఎంత‌న్న‌ది యూనిట్ స్పందిస్తే గాని తెలియ‌దు. గ‌తంలో కొర‌టాల ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కిన `శ్రీమంతుడు` లో శ్రుతి హాస‌న్ హీరోయిన్ గా న‌టించిన సంగ‌తి తెలిసిందే. ప్ర‌స్తుతం శృతి హాస‌న్ ప‌లు త‌మిళ్, హిందీ సినిమాల‌తో బిజీగా ఉంది. ఈ నేప‌థ్యంలో టాలీవుడ్ ఆఫ‌ర్ల‌ను సైతం తిరస్క‌రించింది. అలాగే క‌మ‌ల్ హాస‌న్ ప్రెస్టిజీయ‌స్ ప్రాజెక్ట్ లో `శ‌భాయ్ నాయుడు`లో న‌టిస్తూ ప్రొడ‌క్ష‌న్ ప‌నులు చూసుకుంటోన్న సంగ‌తి తెలిసిందే.

 

Also Read: Shruti Hassan To Share Screen With Chiranjeevi

User Comments