శృతిహాస‌న్-మైఖెల్ బ్రేక‌ప్

విశ్వ‌న‌టుడు క‌మ‌ల‌హాస‌న్ త‌న‌య శృతి హాస‌న్ లండ‌న్ కు చెందిన థియేటర్‌ ఆర్టిస్ట్‌ మైఖెల్‌ కోర్సేల్‌తో ప్రేమ‌లో ప‌డిన సంగ‌తి తెలిసిందే. కొన్నాళ్ల పాటు గాఢ ప్రేమ‌లో ఉన్న జంట త్వ‌ర‌లోనే వివాహ బంధంతో ఒక‌టి కాబోతున్న‌ట్లు క‌థ‌నాలొచ్చాయి. మైఖెల్ కోసం నెల‌కొసారైనా శ్ర‌తి లండ‌న్ వెళ్లొచ్చొది. సామాజిక మాధ్య‌మాల్లో ఇద్ద‌రుకు సంబంధించి ఫోటోలు అంతే జోరుగా వైర‌ల్ అయ్యేవి. ఇది రిలేష‌నా? అని ప్ర‌శ్నించినా ప్ర‌తీసారి పిట్ల‌ క‌థ‌లు చెప్పి త‌ప్పించుకునే వారు. ఇరు కుటుంబ స‌భ్యులు క‌లిసిన సంద‌ర్భాలున్నాయి. అయితే ఇప్పుడీ జంట‌కు ప్రేమ‌కు బ్రేక‌ప్ చెప్పేసింది. ఈ విష‌యాన్ని మైఖెల్ ఇన్ స్టాగ్రామ్ ద్వారా వెల్ల‌డించాడు.

జీవితం మమ్మల్నిద్దరినీ వ్యతిరేక మార్గాల్లో న‌టిపిస్తోంది. ప్ర‌స్తుతం ఎవ‌రి దారుల్లో వాళ్లున్నాం. కానీ ఈ యంగ్‌ లేడీ ఎప్పటికీ నాకు మంచి స్నేహితురాలిగా మిగిలిపోతుంది. శృతికి జీవితాంతం ఓ స్నేహితుడిగా ఉండిపోతున్నందుకు గొప్పగా ఫీలవుతున్నాను అని తెలిపాడు. అలాగే శృతి హాస‌న్ తో కలిసి దిగిన ఫొటోను షేర్ చేసాడు. ఇద్దరి మధ్య ఎలాంటి గొడవలు లేవని, స్నేహపూర్వకంగానే విడిపోయారని సన్నిహిత వర్గాలు అంటున్నాయి. శృతి ప్రేమలో ఉన్నంత కాలం సినిమాల‌కు దూరంగా ఉన్న సంగ‌తి తెలిసిందే. మ‌రీ బ్రేక‌ప్ కార‌ణంగానే కొత్త క‌మిట్ మెంట్లు షురూ చేసిన‌ట్లుంది. ఇటీవలే విజ‌య్ సేతుప‌తి స‌ర‌స‌న న‌టిస్తోన్న ఆమె కొత్త సినిమా ప్రారంభ‌మైన సంగ‌తి తెలిసిందే.

Also WatchActress Vedika Latest Stills