అడ్డంగా బుక్క‌యిన‌ స్టార్‌డాట‌ర్‌

Last Updated on by

ఓ సినిమాకి అంగీక‌రించి ఆ సినిమా మ‌ధ్య‌లో ఉండ‌గానే, వేరొక సినిమాకి క‌మిట‌వ్వ‌డం.. అటుపై కాల్షీట్లు క్లాషెస్ త‌లెత్త‌డం ప‌లువురు నాయిక‌ల విష‌యంలో చూశాం. ఇదివ‌ర‌కూ శ్రుతిహాస‌న్ ఇదే త‌ర‌హాలో ఓ చిత్రానికి అంగీక‌రించి, అటుపై ఆ సినిమా ప్రారంభం కాక‌ముందే, వేరొక సినిమాకి కమిటైపోవ‌డం పెద్ద ర‌చ్చ‌కు కార‌ణ‌మైంది. ఇక సెట్స్‌కెళ‌తారు అనుకుంటుండ‌గానే ఆ సినిమాకి హ్యాండిచ్చి శ్రుతి వేరొక క్రేజీ త‌మిళ హీరో సినిమాకి సంతకం చేసింది. నాగార్జున‌- పీవీపీ కాంబో చిత్రం `ఊపిరి` విష‌యంలో శ్రుతి ఇలా చేసింది. శ్రుతిపై బాగా కాలిన పీవీపీ కోర్టు కేసు కూడా వేశారు. అటుపై ఆ వివాదాన్ని మ‌ధ్య‌వ‌ర్తులే ప‌రిష్క‌రించారు.

తాజాగా అలాంటి స‌న్నివేశ‌మే ఒక‌టి బాలీవుడ్ డెబ్యూ నాయిక సారా అలీఖాన్ ఫేస్ చేస్తోంది. ఈ భామ న‌టిస్తున్న డెబ్యూ సినిమా `కేధార్‌నాథ్‌` ఆర్థిక భారం వ‌ల్ల మ‌ధ్య‌లోనే ఆగిపోయింది. ఆ క్ర‌మంలోనే సెప్టెంబ‌ర్ నుంచి సారా వేరొక క్రేజీ సినిమాకి కాల్షీట్లు కేటాయించేసింది. వాస్త‌వానికి సెప్టెంబ‌ర్‌లో త‌మ సినిమాలో సారా న‌టించాల్సి ఉందంటూ కేధార్‌నాథ్ ద‌ర్శ‌కుడు అభిషేక్ క‌పూర్ త‌న‌పై కోర్టులో కేసు వేశారు. సారా 5కోట్ల మేర కాంప‌న్సేష‌న్ చెల్లించాల‌ని అత‌డు కోర్టును డిమాండ్ చేశాడు. కాల్షీట్ల క్లాషెస్ వ‌ల్ల తాము న‌ష్ట‌పోనున్నామ‌ని అత‌డు కేసు పెట్టాడు. ఆరంగేట్ర చిత్ర‌మే సారాకు బోలెడ‌న్ని చిక్కులు తెచ్చిపెడుతోంది. ఈ వివాదాన్ని స్టార్ డాట‌ర్ డాడ్ సైఫ్ ఖాన్ ఎలా హ్యాండిల్ చేస్తాడో చూడాలి.

User Comments