ద‌ర్శ‌కుడికి చెంప దెబ్బ.. ఆ హీరోనే కార‌ణం

Star Director Gets Slapped By Wife

చిరంజీవి ట్వీట్ వ‌ల్ల భార్య చేతిలో చెంప దెబ్బ తినాల్సి వ‌చ్చిందంటున్నాడు అగ్ర ద‌ర్శ‌కుడు పూరి జ‌గ‌న్నాథ్‌. చెంప ప‌గిలిపోయింద‌నీ, ఇప్పుడు నేనెవ‌రికి చెప్పుకోవాల‌ని ఆయ‌న ఆవేద‌న వ్య‌క్తం చేస్తున్నాడు. ఇంత‌కీ పూరిని ఆయ‌న భార్య ఎందుకు కొట్టిన‌ట్టు? ఆ చెంప దెబ్బ త‌ర్వాత పూరి రియాక్ష‌న్ ఏమిటి? తెలుసుకోవాల‌ని ఉందా? అయితే చ‌ద‌వండి. అగ్ర క‌థానాయ‌కుడు చిరంజీవి ఇటీవ‌లే ట్విట్ట‌ర్‌లో చేరిన సంగ‌తి తెలిసిందే. అది చూసి చాలామంది ఆయ‌న‌కి వెల్క‌మ్ చెప్పారు. పూరి వెల్క‌మ్ ట్వీట్‌ని చూసిన చిరంజీవి వెంట‌నే త‌న‌దైన శైలిలో స్పందించారు. “కరోనా టైమ్ క‌దా, ముంబై, బ్యాంకాక్ బీచుల‌ని మిస్ అవుతుంటావేమో` అని స‌ర‌దాగా ఓ కామెంట్ పెట్టాడు. అది నెటిజ‌న్ల‌ని బాగా ఆక‌ట్టుకుంది. చిరు సెన్సాఫ్ హ్యూమ‌ర్‌కి ఆ కామెంట్ అద్దం ప‌ట్టింది. అయితే ఇక్క‌డ పూరికి మాత్రం చెంప ప‌గిలిపోయేలా చేసిందట ఆ ట్వీట్‌. ప‌క్క‌నే ఉన్న పూరి భార్య లావ‌ణ్య ఆ ట్వీట్ చూశాక పాత విష‌యాల‌న్నీ గుర్తుకొచ్చి పూరి జ‌గ‌న్నాథ్ చెంప‌పై కొట్టింద‌ట‌. ఓ ప్ర‌ముఖ ప‌త్రిక‌కి ఇచ్చిన ఇంట‌ర్వ్యూలో పూరి ఆ విష‌యాన్ని వెల్ల‌డించారు. “అస‌లు చిరంజీవి గారికి ఆ బ్యాంకాక్ ఎందుకు గుర్తుకొచ్చిందో అర్థం కావ‌డం లేదు. ఆ ట్వీట్ చూశాక నా భార్య చేతిలో త‌న్నులు తినాల్సి వ‌చ్చింది. చెంప ప‌గిలిపోయేలా కొట్టింద“ని చెప్పాడు. ట్విట్ట‌ర్‌లో చిరు సెన్సాఫ్ హ్యూమ‌ర్‌కి త‌గ్గ‌ట్టుగానే పూరి రియాక్ష‌న్ ఉంది క‌దూ!! అన్న‌ట్టు పూరి ఆ ఇంట‌ర్వ్యూలో ప‌లు విష‌యాల్ని వెల్ల‌డించారు.