ముంబై బ్యూటీతో స్టార్ డైరెక్ట‌ర్ ఎఫైర్‌!?

Last Updated on by

క‌థానాయికల‌తో ద‌ర్శ‌కుల ఎఫైర్ గురించి నిరంత‌రం చ‌ర్చ సాగుతుంటుంది. సెట్స్ లో సాన్నిహిత్యం.. ప్రేమ‌గా మార‌డం అన్న‌ది అనాదిగా చూస్తున్న‌దే. టాలీవుడ్ 88ఏళ్ల హిస్ట‌రీలో ఎంద‌రో ద‌ర్శ‌కులు క‌థానాయిక‌ల్ని ప్రేమించిన సంద‌ర్భాలున్నాయి. ఇక అసిస్టెంట్ డైరెక్ట‌ర్లు ప్రేమాట‌లు ఆడ‌డం అన్న వ్య‌వ‌హారంపై తెర‌వెన‌క ఆస‌క్తిక‌ర చ‌ర్చ సాగుతూనే ఉంటుంది. ప్రేమ తాలూకా మ‌త్తు అలాంటిది మ‌రి! అదంతా అటుంచితే టాలీవుడ్ కి చెందిన ఓ స్టార్ డైరెక్ట‌ర్ .. ఓ అందాల బొమ్మ‌తో నిండా ప్రేమ‌లో ఉన్నార‌ట‌. స‌ద‌రు ద‌ర్శ‌కుడు `మాట‌`తోనే మాయ చేస్తార‌న్న పేరు ఉంది. మాట గాడు.. చేత‌గాడు.. చేతినిండా ప‌ని ఉన్నోడు .. అందుకే అత‌డంటే ఆ అందాల క‌థానాయిక తెగ ఇదైపోతోంద‌ట‌. టాలీవుడ్ లో త‌న కెరీర్ ని సుస్థిరం చేసుకునేందుకు స‌ద‌రు ట్యాలెంటెడ్ డైరెక్ట‌ర్ తో అమ్మ‌డు ఎఫైర్ సాగిస్తోంద‌న్న రూమ‌ర్ ప్ర‌స్తుతం వేడెక్కిస్తోంది.

అయితే స‌ద‌రు క‌థానాయిక‌కు ఆ సీనియ‌ర్ ద‌ర్శ‌కుడి గ‌త వ్య‌వ‌హారం తెలియ‌దా? అంటూ చెవులు కొరుక్కుంటూ బుగ్గ‌లు నొక్కుకునేవాళ్లు ఉన్నారు. అత‌గాడు ఇదివ‌ర‌కూ త‌న క‌థానాయిక‌ల‌తో ప్రేమ‌లో ప‌డ‌డంపై ఆ అమ్మ‌డికి తెలీదా పాపం? అంటూ గుస‌గుస‌లాడేసుకుంటున్నారు. ఓ క‌థానాయిక అయితే అత‌డిని ఎంత‌గానో ప్రేమించి పెళ్లాడాల‌నుకుంది. త‌న స‌ర్వం అర్పించింది. కానీ చివ‌రిలో అత‌డు ఇచ్చిన ట్విస్టుకి దిమ్మ తిరిగిపోయింది. ఆ త‌ర్వాత ఆ బ్యూటీ కెరీర్ కి కూడా ఆల్మోస్ట్ ఎండ్ కార్డ్ ప‌డిపోయింది. అలా అవ్వ‌డానికి స‌ద‌రు ద‌ర్శ‌కుడే కార‌ణ‌మ‌న్న ప్ర‌చారం సాగింది. అయితే అంత ట్రాక్ రికార్డు ఉన్న స‌ద‌రు ద‌ర్శ‌కుడికి నేటి త‌రం స్టార్ హీరోయిన్ ఎలా ప‌డిపోయింద‌బ్బా? అంటూ గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి. ఇప్ప‌టికే అత‌డి ద‌ర్శ‌క‌త్వంలో ఓ సినిమాలో న‌టించి బ్లాక్ బ‌స్ట‌ర్ కొట్టింది. ప్ర‌స్తుతం ప‌లువురు స్టార్ హీరోల స‌ర‌స‌న నాయిక‌గా న‌టించేస్తోంది. తదుప‌రి స‌ద‌రు ద‌ర్శ‌కుడు ఓ స్టార్ హీరో సినిమాలో అవ‌కాశం ఇచ్చాడు. అటుపైనా త‌న స‌ర్కిల్స్ లో స‌ద‌రు హీరోయిన్ పేరును రిక‌మండ్ చేస్తున్నాడ‌ట‌. మొత్తానికి ఆ ఇద్దరి మ‌ధ్యా ఇంకేదో చాలా పెద్ద‌గానే ర‌న్ అవుతోంద‌న్న ముచ్చ‌ట ప‌రిశ్ర‌మ‌ను వేడెక్కించేస్తోంది. ఓవ‌రాల్ గా ఈ ఎఫైర్ క‌హానీ యువ‌త‌రంలో వాడి వేడిగా చ‌ర్చ‌కు వ‌చ్చింది.

Also Read: Star Director Affair With Young Beauty?

User Comments