హీరోయిన్‌కి స్టార్ ప్రొడ్యూస‌ర్ కాస్ట్‌లీ గిఫ్ట్‌!

Last Updated on by

ఆయ‌నో ప‌క్కా జెంటిల్‌మేన్. టాలీవుడ్‌లో పేరున్న నిర్మాత‌. నోట్లో వేలు పెడితే అస్స‌లు కొర‌క‌లేడ‌నే చుట్టూ ఉన్న‌వాళ్లు భావిస్తారు. అంత క్లీన్ ఇమేజ్‌ని మెయింటెయిన్ చేస్తుంటారు. క‌ట్ చేస్తే ఆయ‌న లైఫ్‌లో సినిమాటిక్ ట్విస్టు ఒక‌టుంది! ఆ ఒక్క‌టీ ఏంటో అడ‌గొద్దు ప్లీజ్!!

ఇంత‌కీ ఆ ఒక్క‌ సీక్రెట్ క‌థాక‌మామీషు ఏంటో?.. ఆయ‌న లైఫ్‌లో సినిమాటిక్ ట్విస్టు ఏంటో? అంటే.. కాస్త డీప్‌గా వివ‌రాల్లోకి వెళ్లాలి. ప్ర‌తి ఒక్క‌రిలో త‌మంత‌ట తాము క‌నిపెట్ట‌లేని వేరొక అప‌రిచితుడు ఉంటాడ‌న్న‌ది శంక‌ర్ కాన్సెప్టు. అలాంటి అప‌రిచితుడు స‌ద‌రు నిర్మాత‌లో తిష్ట వేసి కూచున్నాడ‌ట‌. ఆ అప‌రిచితుడు రాము కాదు రెమో. సీక్రెట్‌గా గాళ్‌ఫ్రెండ్‌ని మెయింటెయిన్ చేస్తాడు రొమాంటిక్ రెమో. పైగా గాళ్స్ క‌నిపిస్తే రోమాంచితంగా ఉంటాడు. అంతేనా.. క‌ట్టుకున్న‌దానికంటే ఉంచుకున్న‌దానికే ఒగ‌రెక్కువ కాబ‌ట్టి, త‌న గాళ్‌ఫ్రెండ్ కోసం ఏకంగా ఖ‌రీదైన ఫ్లాట్లు రాసిస్తాడ‌ట‌. కోట్ల‌లో సొమ్ములు కుమ్మ‌రించి ఇటీవ‌లే హైద‌రాబాద్‌లోని ఓ పోష్ ఏరియాలో ఖ‌రీదైన ఫ్లాటు స‌ద‌రు యుక్త‌వ‌య‌సు హీరోయిన్‌కి కొనిచ్చాడ‌ట‌. ఇంత‌కుముందు ఓ ఖ‌రీదైన ఫ్లాటు ఇచ్చాడు. ఇదే తీరుగా ఇలాంటి ఖ‌రీదైన‌ బ‌హుమ‌తులెన్నో ఇచ్చాడు. అంతేనా.. హైద‌రాబాద్‌లో ఉంటే బాగానే ఉంటాడు. అమెరికా వెళితే చెల‌రేగిపోతాడు. అక్క‌డ ఏకంగా కేసినోల్లో తేల్తాడు. అక్క‌డ బోలెడంత చిద్విలాసం ఆస్వాధిస్తాడు. ఏదైతేనేం ఖ‌రీదైన కానుక‌లు అందుకుంటున్న స‌ద‌రు గాళ్ ఫ్రెండ్ కం స్ట్ర‌గ్లింగ్‌ హీరోయిన్ ప్ర‌స్తుతం అవ‌కాశాల కోసం ఆఫీసుల చుట్టూ తిరిగే బెంగ లేదు. అందువ‌ల్ల కెరీర్ గురించే ఆలోచించ‌డం మానేసిందిట‌. త‌న‌కంటే డ‌బుల్ వ‌య‌సున్న స‌ద‌రు నిర్మాత‌తో ఎఫైర్ సాగిస్తూ, రాబ‌ట్టాల్సిన మొత్తం రాబ‌డుతోంద‌ని, ఆస్తులు పోగేసుకుని సోకులు చేస్తోంద‌న్న‌ది టాప్ సీక్రెట్‌. అయితే ర‌హ‌స్యం దాచితే దాగుతుందా? ఈ ర‌హ‌స్యం తెలిసిన‌వారు అతి కొద్ది మంది స‌న్నిహితుల నుంచి అలా అలా స‌ర‌దాగా లీకైపోయిందంతే! అస‌లింత‌కీ ఈ ఎపిసోడ్‌లో స‌ద‌రు నిర్మాత ఎవ‌రు? హీరోయిన్ ఎవ‌రు? అన్న‌ది ప్ర‌స్తుతానికి స‌స్పెన్స్.

User Comments