అగ్ర‌నిర్మాత మిల్క్‌ బిజినెస్‌

Last Updated on by

అగ్ర‌నిర్మాత డి.సురేష్‌బాబు మిల్కీ బోయ్‌గా మారుతున్నారా? అంటే అవున‌నే స‌మాచారం. ఇన్నాళ్లు సినిమా, థియేట‌ర్ల‌ వ్యాపారంతో బిజీబిజీగా ఉన్న సురేష్‌బాబు ఇక‌పై పాల వ్యాపారంలోకి దిగుతున్నారు. హైదరాబాద్ నగర శివారులోని 30 ఎకరాల మేర విస్త‌రించిన‌ వ్యవసాయ క్షేత్రంలో `హ్యాపీ ఆవులు` పేరిట స్వచ్ఛమైన పాల ఉత్పత్తికి శ్రీకారం చుట్టారు. 30 ఆవులు కొనుగోలు చేసి వీటికోసం ప్ర‌త్యేకించి ఓ వైద్యుడిని, పాలికాపుల‌ను నియ‌మించార‌ట‌.

సురేష్‌బాబు ఆక‌స్మికంగా ఇలాంటి నిర్ణ‌యం తీసుకోవ‌డానికి కార‌ణ‌మేంటి? అని ఆరాతీస్తే హైద‌రాబాద్ న‌గ‌రం స‌హా అన్నిచోట్లా క‌ల్తీ పాల దందా దారుణంగా ఉంద‌ని, అది ప్ర‌జారోగ్యాన్ని అంతే దారుణంగా నాశ‌నం చేస్తోంద‌ని భావించి, ప్ర‌జా ర‌క్ష‌ణ కోసం చేస్తున్నార‌ట‌. గ‌తంలో త‌న‌కు కూడా క‌ల్తీ పాల ఎఫెక్ట్ ప‌డ‌డంతో ఈ అగ్ర‌నిర్మాత త‌నే పాల డెయిరీ మొద‌లెట్టేశారు. త‌మ కుటుంబం కోసం, అలానే ప్ర‌జ‌ల కోసం ఆయ‌న ఈ నిర్ణ‌యం తీసుకున్నాన‌ని చెప్పారు. అయితే ఆవుపాలు లీట‌రు ధ‌ర ఎంతో తెలుసా? జ‌స్ట్‌.. రూ.150. దీనినిబ‌ట్టి ఈ పాల‌ను ఓన్లీ సెల‌బ్రిటీలు మాత్ర‌మే ఖాతాలు పెట్టుకుని కొనుక్కుంటార‌న్న‌మాట‌!

User Comments