స్టార్‌ విల‌న్ డెత్ మిస్ట‌రీ.. హ‌త్యా? ఆత్మ‌హ‌త్యా?

Last Updated on by

బాలీవుడ్ స్టార్ విల‌న్ మ‌హేష్ ఆనంద్ (57) మిస్టీరియ‌స్ డెత్ సంచ‌ల‌న‌మైంది. ముంబై వెర్సోవాలోని ఆయ‌న స్వ‌గృహంలో డెడ్ బాడీ పూర్తిగా కుళ్లిన పొజిష‌న‌లో క‌నిపించ‌డం షాక్ కి గురి చేస్తోంది. వెర్సోవా పోలీసులు ప్ర‌స్తుతం కేసు న‌మోదు చేసి ఇన్వెస్టిగేష‌న్ ప్రారంభించారు. మూడు రోజుల క్రిత‌మే మ‌హేష్ ఆనంద్ సోఫాలో కూచుని అలానే మ‌ర‌ణించారు. డెడ్ బాడీ పూర్తిగా కుళ్లిన ద‌శ‌లో ఉంద‌ని పోలీసులు చెబుతున్నారు. కూప‌ర్ హాస్పిట‌ల్ కి మృత‌దేహాన్ని త‌ర‌లించి పోస్ట్ మార్ట‌మ్ నిర్వ‌హిస్తున్నారు. మ‌హేష్ ఆనంద్ మ‌ర‌ణం వెన‌క మిస్ట‌రీని ఛేధించేందుకు పోలీసులు శ్ర‌మిస్తున్నారు. మ‌హేష్ ఆనంద్ యారీ రోడ్ లో `కినెర` అనే భ‌వంతిలో ఒంట‌రిగా నివ‌సిస్తున్నారు. ఇది హ‌త్యా? ఆత్మ‌హ‌త్య‌నా? ఏవైనా ఆర్థిక స‌మ‌స్య‌లు ఉన్నాయా? అన్న కోణంలో ఆరాలు తీస్తున్నారు.

అయితే మ‌హేష్ ఆనంద్ ఆక‌స్మిక మృతి గురించి తెలుసుకున్న బాలీవుడ్ షాక్ కి గురైంది. మ‌హేష్ ఆనంద్ 80-90ల‌లో గ్రేట్ విల‌న్ గా, క్యారెక్ట‌ర్ ఆర్టిస్టుగా రాణించారు. బాలీవుడ్ లో ఎన్నో బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్స్ లో న‌టించారు. షాహెన్ షా (1998), గంగ జ‌మున స‌ర‌స్వతి (1998), మ‌జ్బూర్ (1989), స్వ‌ర్గ్ (1990), తానేదార్ )1990, విశ్వాత్మ (1992) , కూలీ నంబ‌ర్ 1 (1995), విజేత (1996), కురుక్షేత్ర (2000) వంటి చిత్రాల్లో న‌టించారు. సూప‌ర్ స్టార్ కృష్ణ – సౌంద‌ర్య జంట‌గా న‌టించిన‌ `నంబ‌ర్ 1` లో మ‌హేష్ ఆనంద్ న‌టించిన సంగ‌తి తెలిసిందే. ఆ చిత్రంలో సైకో త‌ర‌హా పాత్ర‌లో న‌టించారు. జ‌గ‌దేక వీరుడు అనే వేరొక టాలీవుడ్ చిత్రంలోనూ మ‌హేష్ ఆనంద్ న‌టించారు. దాదాపు 18 ఏళ్ల గ్యాప్ త‌ర్వాత ఇటీవ‌లే గోవిందా న‌టించిన రంగీలా రాజా చిత్రంలో ఆయ‌న న‌టించారు. అదే ఆయ‌న చిట్ట చివ‌రి సినిమా. ఇక లైఫ్ లో మ‌హేష్ ఆనంద్ నాలుగు పెళ్లిల్లు చేసుకున్నార‌ని కుటుంబ స‌భ్యులు వెల్ల‌డించారు. బ‌ర్కారాయ్, ఎరికా మారియా, మ‌ధు మ‌ల్హోత్రా, లానా అనే న‌లుగురిని ఆయ‌న పెళ్లాడారు.

User Comments