ఈరోస్‌తో 1000కోట్ల ఒప్పందం

Last Updated on by

ఓవైపు భారీ చిత్రాలు నిర్మిస్తూనే, మ‌రోవైపు వెబ్‌సిరీస్‌లు, టెలీసిరీస్‌లు నిర్మిస్తూ వంద‌ల కోట్ల రూపాయ‌ల్ని పెట్టుబడులుగా వెద‌జ‌ల్లుతోంది ఈరోస్ ఇంట‌ర్నేష‌నల్ సంస్థ‌. అంతార్జాతీయ స్థాయిలో ఈ సంస్థ సినిమాల్ని నిర్మిస్తూ, డిజిట‌ల్ ప్లాట్‌ఫామ్‌ని విస్త‌రిస్తూ క్రియేటివిటీ ఉన్న‌వారికి అవకాశాలిస్తోంది. ప్ర‌స్తుతం ఈ సంస్థ‌తో టాలీవుడ్ స్టార్ రైట‌ర్ విజ‌యేంద్ర ప్ర‌సాద్ ఓ భారీ ఒప్పందం చేసుకున్నార‌ని తెలుస్తోంది. ఈ ఒప్పందం విలువ వంద‌ల కోట్లు అని ముచ్చ‌టించుకుంటున్నారు.

బాహుబ‌లి, భ‌జ‌రంగి భాయిజాన్ వంటి బ్లాక్‌బ‌స్ట‌ర్ల‌కు ప‌ని చేసిన ర‌చ‌యిత‌గా విజ‌యేంద్ర ప్ర‌సాద్ క్రేజు స్కైని ట‌చ్ చేసింది. ఆ క్ర‌మంలోనే అత‌డికి ఊపిరి స‌ల‌ప‌న‌న్ని ఆఫ‌ర్లు వ‌చ్చాయి. ఓవైపు తెలుగు సినిమాల‌కు రాస్తూనే, మ‌రోవైపు అటు హిందీ, త‌మిళ చిత్రాల‌కు ఆయ‌న ర‌చ‌యిత‌గా ప‌ని చేస్తున్నారు. ఏ రైట‌ర్ రాసిన స్క్రిప్టు అయినా ఆయ‌న ద‌గ్గ‌ర‌కు వెళుతోంది. ఓ ర‌కంగా విజ‌యేంద్ర ప్రసాద్ స్క్రిప్టు డాక్ట‌ర్‌గా ప‌ని చేస్తున్నారు. ఇక‌పోతే ది గ్రేట్ ఈరోస్ ఇంట‌ర్నేష‌న‌ల్‌కు ఆయ‌న మొత్తం 10 స్క్రిప్టులు ఇచ్చారు. వీటితో సినిమాలు, వెబ్ సిరీస్‌లు నిర్మించేందుకు స‌ద‌రు సంస్థ స‌న్నాహ‌కాల్లో ఉంది. మొత్తం 8-10 మంది ద‌ర్శ‌కుల‌ను విజ‌యేంద్రుడు ప‌రిచ‌యం చేస్తున్నార‌ట‌. అంతేకాదు ఈ ఒప్పందంతో త‌మ్ముడు ఎస్‌.ఎస్‌.కాంచీకి చేతినిండా ప‌ని అప్ప‌జెప్పార‌ట‌ విజ‌యేంద్రుడు. ఇద్ద‌రూ క‌లిసే స్క్రిప్టుల డిజైన్ చేశార‌ని తెలుస్తోంది. విజ‌యేంద్రుడు మ‌రోవైపు రాజ‌మౌళి మ‌ల్టీస్టార‌ర్ స్క్రిప్టుతోనూ బిజీగా ఉన్న సంగ‌తి తెలిసిందే.

User Comments