మ‌హాన‌టి.. అదేంటి ఇంకా వ‌ద‌ల‌ట్లేదా..?

Last Updated on by

ఈ రోజుల్లో ఓ సినిమా విడుద‌లైన త‌ర్వాత మూడు రోజుల్లోనే దాని ఫ‌లితం తెలిసిపోతుంది. మ‌హా అయితే వారం రోజుల్లో అంతా అయిపోతుంది. ఆ త‌ర్వాత ప్ర‌మోష‌న్ చేసుకున్నా కూడా పెద్ద‌గా ఒరిగెదేమీ ఉండ‌దు. ఈ విష‌యం అంద‌రికీ తెలుసు. కానీ మ‌హాన‌టి టీం మాత్రం ప‌ట్టు వ‌ద‌ల‌కుండా త‌మ సినిమా ప్ర‌మోష‌న్ చేస్తూనే ఉన్నారు. విడుద‌లై మూడు వారాలు గ‌డుస్తున్నా కూడా ఇప్ప‌టికీ ప్ర‌మోష‌న్స్ జోరు త‌గ్గ‌ట్లేదు. రోజు ఏదో విధంగా టీవీలో క‌నిపిస్తూనే ఉన్నారు. ఇప్ప‌టికీ ఇంట‌ర్వ్యూలు ఆప‌డం లేదు. మొన్న‌టికి మొన్న చంద్ర‌బాబు పిలిచి స‌న్మానించాడు.. అద‌లా పూర్తయిందో లేదో థియేటర్ క‌వ‌రేజ్ అంటూ వెళ్లారు.. ఇక నిన్న‌టికి నిన్న వైజాగ్ లో భారీగా విజ‌యోత్స‌వ స‌భ నిర్వ‌హించారు.

సినిమా ఇప్ప‌టికీ వ‌సూళ్ల వ‌ర్షం కురిపిస్తుండ‌టంతో అంత ఈజీగా ఈ వేడిని త‌గ్గించాల‌నుకోవ‌డం లేదు చిత్ర‌యూనిట్. అందుకే ఇప్ప‌టికీ ప్ర‌మోష‌న్స్ దంచేస్తున్నారు. ఇప్ప‌టి వ‌ర‌కు మూడు వారాల్లో 37 షేర్ వ‌సూలు చేసింది మ‌హాన‌టి. ఈ చిత్ర దూకుడు చూస్తుంటే నాలుగో వారం కూడా కుమ్మేసేలా కనిపిస్తుంది. ఈ వారం నాలుగు సినిమాలు వ‌స్తున్నా కూడా మ‌హాన‌టి మాత్రం అగ్ర‌తాంబూలం తీసుకునేలా ఉంది. చూడాలిక‌.. ఈ ప్ర‌మోష‌న్స్ ఎప్పుడు ఆగుతాయో..? ఎక్క‌డ మ‌హాన‌టి ఉధృతం ఆగుతుందో..?

User Comments