మ‌హేష్26 కోసం ఏ లాజిక్‌?

Last Updated on by

లెక్క‌ల మాష్టార్ సుకుమార్ జిమ్మిక్కులు అన్నీ ఇన్నీ కావు. క‌థ‌ల‌కు రివ‌ర్స్ గేర్‌లో కోటింగ్ ఇవ్వ‌డంలో ఆయ‌న దిట్ట‌. ఆర్య నుంచి అత‌డి శైలి ఇదే. అవ‌త‌లివారి సైకాల‌జీని బ‌ట్టి స‌న్నివేశాన్ని హ్యాండిల్ చేయ‌డం అనే కొత్త క‌నిక‌ట్టు విద్య‌ను సుక్కూ తొలి సినిమాతోనే ప్ర‌వేశ‌పెట్టారు. లాజిక్‌తో జిమ్మిక్ చేసి ఆరంగేట్ర‌మే బ్లాక్‌బ‌స్ట‌ర్ హిట్ కొట్టిన సుకుమార్ ఆ త‌ర‌వాత సీక్వెల్ సినిమా ఆర్య 2ని అదే పంథాలో న‌డిపించారు.

ఆ త‌ర‌వాత 1నేనొక్క‌డినే లాజిక్ వేరు. ఆ సినిమాలో అద్భుత‌మైన టెక్నిక్ వాడారు. స్క్రీన్‌ప్లే జిమ్మిక్కును ఆస‌క్తిక‌రంగా డ్రైవ్ చేశారు. 1 -ఫ‌లితం ఎలా ఉన్నా.. సుక్కూ టెక్నిక్‌ని మాత్రం విమ‌ర్శ‌కులు ఐడెంటిఫై చేశారు. ఇటీవ‌లే రిలీజై సంచ‌ల‌న విజ‌యం సాధించిన `నాన్న‌కు ప్రేమ‌తో` లాజిక్ వేరు… `రంగ‌స్థ‌లం` జిమ్మిక్ పూర్తిగా వేరే. ఇప్ప‌టివ‌ర‌కూ సుకుమార్ తీసిన సినిమాల‌న్నీ ఒక‌దానితో ఒక‌టి సంబంధం లేనివే. వీట‌న్నిటికీ వైవిధ్య‌మైన‌ది `100ప‌ర్సంట్ ల‌వ్‌`. లాజిక్ ప‌రంగా.. జిమ్మిక్ ప‌రంగా.. కంటెంట్ ప‌రంగా విల‌క్ష‌ణ‌త సుక్కూ ప్ర‌తి సినిమాలో క‌నిపిస్తుంది. క‌థా వైవిధ్యం, స్క్రీన్‌ప్లే జిమ్మిక్కులు, లాజిక్కుల్లో సుకుమార్‌ ఏ ఇత‌ర ద‌ర్శ‌కుడితో పోల్చినా ది బెస్ట్ మాష్ట‌ర్‌మైండ్ అని నిరూపించాడు. అందుకే సుక్కూని ద‌ర్శ‌క‌ధీరుడు రాజ‌మౌళి అంత‌టివారే విప‌రీతంగా అభిమానిస్తారు. అయితే సుకుమార్ ఈసారి మ‌హేష్26 కోసం ఏ లాజిక్ వాడుతున్నారు? అస‌లు ఈ లెక్క‌ల మాష్టార్ లెక్కేంటి? అంటే ఇప్ప‌టికైతే స‌స్పెన్స్‌. ప్ర‌స్తుతం స్క్రిప్టు రెడీ అవుతోంది. త‌న సంస్థానంలో న‌మ్మ‌స్తుడైన ఓ అసోసియేట్ చెప్పిన లైన్ న‌చ్చి..దానిని పూర్తి స్థాయి స్క్రిప్టుగా తీర్చిదిద్దుతున్నార‌ట‌. కాన్సెప్టు, సీన్లు పూర్తిగా డెవ‌ల‌ప్ చేశాక‌.. ఈ ఏడాది చివ‌రిలో సెట్స్‌పైకి తీసుకెళ‌తార‌ని తెలుస్తోంద‌తి. అటుపై 2019లో రిలీజ్ ఉంటుందిట‌. మ‌హేష్ – సుకుమార్ కాంబినేష‌న్‌లోని ఈ చిత్రాన్ని మైత్రి మూవీస్ సంస్థ నిర్మిస్తున్న సంగ‌తి తెలిసిందే.

User Comments