స్టూడెంట్ నం.1 పార్ట్ 2

Last Updated on by

ఎన్టీఆర్ హీరోగా త్రివిక్ర‌మ్ `అర‌వింద స‌మేత‌` తెర‌కెక్కిస్తున్న సంగ‌తి తెలిసిందే. ప్ర‌స్తుతం ఈ సినిమా చిత్రీక‌ర‌ణ శ‌ర‌వేగంగా సాగుతోంది. రామోజీ ఫిలింసిటీలో ఈనెల 12 వ‌ర‌కూ చిత్రీక‌ర‌ణ సాగించి, అటుపై శంషాబాద్‌కి షిఫ్ట్ చేస్తార‌ట‌. ఆ త‌ర్వాత పొల్లాచ్చిలో గ్రామీణ‌ నేప‌థ్యంలో ఓ పాట చిత్రీక‌ర‌ణ చేస్తార‌ని తెలిసింది. ద‌స‌రా కానుక‌గా అక్టోబ‌ర్ 12న‌ రిలీజ్ చేయ‌డ‌మే ధ్యేయంగా ఈ సినిమాని వేగంగా పూర్తి చేస్తున్నారు.

ఇక‌పోతే ఈ సినిమాలో ఎన్టీఆర్ ద్విపాత్రాభిన‌యం గురించి ఆస‌క్తిక‌ర చ‌ర్చ సాగుతోంది. రాయ‌ల‌సీమ‌లో వీర‌రాఘ‌వ పాత్ర‌లో, సిటీకి వ‌చ్చాక సిద్ధార్థ్ గౌత‌మ్ పాత్ర‌లో ఎన్టీఆర్ న‌టిస్తున్నారు. ఇప్ప‌టికే రామోజీ ఫిలింసిటీలో యాక్ష‌న్‌, ఫ్యాక్ష‌న్ సీన్ల‌లో న‌టించేశాడు. అది వీరరాఘ‌వుడు. ఈసారి మాత్రం కాలేజ్ విద్యార్థి సిద్ధార్థ్‌గా న‌టిస్తాడ‌ట‌. శంషాబాద్‌లో ఈ స‌న్నివేశాల చిత్ర‌ణ ఉంటుంద‌ని తెలిసింది. స్టూడెంట్ పాత్ర‌లో ఎన్టీఆర్ అన‌గానే స్టూడెంట్ నంబ‌ర్ 1 గుర్తుకొస్తుంది. ఆ సినిమాలో హ‌త్య చేసి జైలుకెళ్లే విద్యార్థి పాత్ర‌లో ఎన్టీఆర్ చ‌క్క‌గా ఎమోష‌న్ పండించాడు. ఇప్పుడు ఫ్యాక్ష‌నిస్టుగా హ‌త్య చేసి, జైలుకెళ‌తాడా? .. స్టూడెంట్ నంబ‌ర్ 1 పాత్ర‌కు కంటిన్యుటీలా ఉంటుందా? అంటూ ఆస‌క్తిగా మాట్లాడుకుంటున్నారు. ఒక‌వేళ స్టూడెంట్ నంబ‌ర్ 1 ఫార్ములాని త్రివిక్ర‌మ్ ఈ పాత్ర‌కు ఆపాదించాడా? అన్న‌ది ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్.

User Comments