స్టైలిష్‌స్టార్ డెబ్యూ డ్యాన్స్‌కి 17 ఏళ్లు

Last Updated on by

అల్లు అర్జున్ .. నేడు వంద కోట్ల క్ల‌బ్ హీరోల్లో ఒక‌డు. `స‌రైనోడు` చిత్రంతో ఈ ఫీట్ అందుకున్నాడ‌ని ట్రేడ్ లో ప్ర‌చారం సాగింది. అయితే ఈ జ‌ర్నీ ఇంతింతై వ‌టుడింతై అన్న చందంగా సాగుతోంది. అంత‌కుముందే బ‌న్ని డెబ్యూ ఇచ్చిన `డాడి` (2001) చిత్రాన్ని గుర్తు చేసుకుంటే.. ఈ సినిమా రిలీజై ఇప్ప‌టికి 17 సంవ‌త్స‌రాలైంది. అంటే బ‌న్ని ఏజ్ 17 అన్న‌మాట‌. ఓ ర‌కంగా 17 ఏళ్ల పాటు టాలీవుడ్‌లో బ‌న్ని కెరీర్ ని సాగించాడ‌ని అనుకోవ‌చ్చు. అయితే డాడి చిత్రంలో స్టైలిష్ డ్యాన్సుల‌తో డెబ్యూ ఇచ్చిన బ‌న్ని 2003లో కె.రాఘ‌వేంద్ర‌రావు ద‌ర్శ‌క‌త్వంలో గంగోత్రి చిత్రంలో హీరోగా న‌టించాడు. ఇదే సినిమాతో ఆర్తిఅగ‌ర్వాల్ సోద‌రి అతిధీ అగ‌ర్వాల్ క‌థానాయిక‌గా తెరంగేట్రం చేసింది. ప్ర‌కాష్‌రాజ్ కీల‌క పాత్ర పోషించారు. డెబ్యూ బంప‌ర్ హిట్.

ఆ క్ర‌మంలోనే బ‌న్నికి స్టైలిష్ డ్యాన్సింగ్ స్టార్ గా గుర్తింపు రావ‌డానికి కార‌ణ‌మైన తొలి మెట్టు మాత్రం `డాడీ`లో స్టెప్పులేన‌ని అభిమానులు చెబుతారు. ఆ త‌ర్వాత దేశ‌ముదురు, హ్యాపి వంటి సినిమాల్లో అంతే అద్భుత‌మైన డ్యాన్సుల‌తో ఆక‌ట్టుకున్నాడు. డాడీతోనే డ్యాన్సింగ్ డెబ్యూ.. స్టైలిష్ డ్యాన్సుల‌ పుట్టుక‌కు 17 ఏళ్లు అని చెప్పాల్సి ఉంటుంది. ఇటీవ‌లే రిలీజైన `నా పేరు సూర్య‌` ఫ్లాపైన సంగ‌తి తెలిసిందే. త‌దుప‌రి త‌న‌ని ట్రాక్‌లోకి తెచ్చే బ్లాక్‌బ‌స్ట‌ర్ కోసం వేచి చూస్తున్నాడు. విక్ర‌మ్‌.కె.కుమార్, త్రివిక్ర‌మ్ వినిపించిన స్క్రిప్టుల్లో ఏది ఫైన‌ల్ చేయ‌బోతున్నాడు? అన్న సస్పెన్స్ ప్ర‌స్తుతం కొన‌సాగుతోంది.

User Comments